నవదీప్ తన వ్యక్తిగత జీవితంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. తాను గే అనే విషయంతో పాటు ఓ హీరోయిన్ చనిపోయిందని తనపై ఆరోపణలపై పూర్తి స్పష్టతనిచ్చేశాడు. ఇంతకీ ఏంటి సంగతి?
తెలుగు నటుల్లో నవదీప్ కాస్త డిఫరెంట్. ఎందుకంటే హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు. మధ్య విలన్ రోల్స్ చేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ పాజిటివ్ సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం పూర్తిగా వెబ్ సిరీసుల్లో నటిస్తున్నాడు. నవదీప్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన సిరీస్ ‘న్యూసెన్స్’. మే 12న ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. అందులో భాగంగానే ప్రెస్ మీట్ నిర్వహించగా.. నవదీప్ కు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి ఇప్పుడు పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒకప్పుడు సినిమాలు థియేటర్లు, ఆ సందడంతా వేరుగా ఉండేది. ఇప్పుడు ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోవడంతో చాలా విషయాల్ని సిరీసులుగా తీసి మెప్పిస్తున్నారు. అలా తెలుగులో ఆహా చాలానే పాపులర్ అయింది. ఈ ఓటీటీ సంస్థ ఇప్పుడు విడుదల చేయబోతున్న ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. మీడియా బేస్డ్ స్టోరీని ఇందులో చూపించబోతున్నారు. నవదీప్, బిందుమాధవి.. రిపోర్టర్స్ గా లీడ్ రోల్స్ చేశారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో నవదీప్ వ్యక్తిగత విషయాలని పలువురు రిపోర్టర్స్ అడిగారు. దానికి అంతే క్లారిటీగా సమాధానమిచ్చేశాడు.
‘2005లో నా వల్ల ఓ హీరోయిన్ చనిపోయిందని ఓ పత్రికలో న్యూస్ వచ్చింది. అది పూర్తిగా అబద్ధం. ఏ హీరోయిన్ కూడా చనిపోలేదు. నేను గే అనే వార్తలు కూడా వచ్చాయి. అది కూడా అబద్ధం. నేను రేవ్ పార్టీలో పాల్గొన్నాని ఓ పేపర్ లో వచ్చింది. ఇదీ ఫేక్. ఎందుకంటే అది జరిగిన టైంలో నేను అమ్మతో ఫామ్ హౌస్ కి వెళ్లాను. అది నా మంచికే. ఎందుకంటే ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల మా ఇంట్లో కూడా నన్ను అనుమానించే పరిస్థితి వచ్చింది. అమ్మతో ఉన్నప్పుడు అలా జరిగిందనే వార్త రాశారు. దాంతో నాపై మా ఇంట్లో నమ్మకం పెరిగింది. మీడియాపై కక్ష సాధింపు చర్యగా మాత్రం ఇందులో యాక్ట్ చేయలేదు’ అని నవదీప్ క్లారిటీ ఇచ్చాడు.