సీనియర్ నటుడు నరేష్-పవిత్రా లోకేష్‌ల గురించి మీడియా, సోషల్ మీడియాలో బోలేడు కథనాలు. ఇక నరేష్‌కి, ఆయన మూడో భార్యకి మధ్య అయితే ఏకంగా మాటల యుద్ధమే నడుస్తోంది. హద్దు దాటి మరీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే నరేష్.. పవిత్రా లోకేష్‌ని వివాహం చేసుకున్నారని రమ్య ఆరోపించగా.. తన మూడో భార్య వ్యక్తిత్వం మంచిది కాదని.. ఎనిమిదేళ్ల క్రితమే ఆమెకు విడాకులు ఇచ్చానని నరేష్ ఆరోపిస్తున్నాడు. వీరి వివాదానికి ఇప్పట్లో ముగింపు లభించేలా లేదు. అసలు నరేష్-పవిత్రా లోకేష్‌లు పెళ్లి చేసుకున్నారా లేదా అన్న విషయం మీద కూడా క్లారిటీ లేదు. ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో తన మూడో భార్య రమ్య రఘుపతి గురించి నరేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
గతంలో నరేష్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో రమ్య రఘుపతి గురించి, తన పెళ్లిళ్ల గురించి చెప్పుకొచ్చిన విషయాలు ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ‘‘పదిహేడేళ్లకే తన కెరీర్ మొదలైందని, 19 ఏళ్లకే ఫస్ట్ మారేజ్ అయిందని చెప్పుకొచ్చింది.. అది ఓ లెక్కన తనది బాల్య వివాహామే. అప్పుడు నా మంచి కోసమే పెద్ద వాళ్లు చేశారు.. అయితే ఆమె అనారోగ్య సమస్యల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని’’… చెప్పుకొచ్చాడు. ఇక మూడో భార్య రమ్య రఘుపతి గురించి చెబుతూ చాలా గొప్పగా మాట్లాడాడు.
ఇది కూడా చదవండి: Rakesh Shetty: నరేశ్ మూడో భార్యతో అక్రమ సంబంధం అంటూ తెరపైకి రాకేశ్ శెట్టి పేరు!
‘‘నా ఐడియాలజీకి, ఆలోచనలకు సరిపోయే మనిషి.. ఎంతో గొప్ప మనిషి.. మా ఫ్యామిలీలో అడ్జస్ట్ అయ్యే మనిషి..’’ అని అన్నాడు. ఇప్పుడు మాత్రం ఆమె మీద సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. వీరి మాటలను బట్టి చూస్తే.. రమ్య రఘుపతి, నరేష్‌ల మధ్య అగాథం ఏర్పడినట్టు అనిపిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Naresh: తన మూడో భార్య రమ్యపై నరేష్ షాకింగ్ కామెంట్స్!