'దసరా'ని రిలీజ్ కు రెడీ చేసిన నాని, ప్రమోషన్స్ లో తెగ పార్టిసిపేట్ చేస్తున్నాడు. తాజాగా అలా ఓ షోలో పాల్గొని తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఏం మాట్లాడినా సరే అది కాంట్రవర్సీ అయిపోతుంది. మరీ ముఖ్యంగా హీరో నాని కావాలని అలా అంటున్నాడా? లేదా అలా జరుగుతుందా? అనేది అస్సలు తెలియట్లేదు. మొన్నటికి మొన్న ‘నిజం విత్ స్మిత’ షోలో నెపోటిజం గురించి మాట్లాడాడు. త్వరలో ‘దసరా’ రిలీజ్ కు రెడీ అయిన సందర్భంగా పలు షోల్లో పాల్గొని తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘సుమ అడ్డా’కి వచ్చిన నాని.. తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో ఒకప్పటి జనరేషన్ అంటే చిరంజీవి, రవితేజ గుర్తొస్తారు. ఆ తర్వాత కాలంలో ఇలా ఫేమ్ తెచ్చుకున్నది అంటే నాని పేరు చెబుతారు. ‘అష్టాచమ్మా’తో హీరో అయిన ఇతడు.. ఆ తర్వాత కాలంలో పక్కింటి అబ్బాయి తరహా రోల్స్ లో నటించి నేచురల్ స్టార్ అయిపోయాడు. తనకంటూ ఓ ఇమేజ్, మార్కెట్ క్రియేట్ చేశాడు. ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ కాబట్టి.. ఆ ఊపులోనే ‘దసరా’ అని ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి కూడా.
ఇలాంటి టైంలో సుమ యాంకర్ గా చేస్తున్న ‘సుమ అడ్డా’కి నానితో పాటు ‘దసరా’ టీమ్ వచ్చింది. తాజాగా రిలీజ్ ప్రోమోనే చూసుకుంటే.. ఫస్ట్ అంతా ఎంటర్ టైన్ మెంట్ చేశారు. చివర్లో క్వశ్చన్ రౌండ్ లో భాగంగా సుమ.. ‘తెలుగు ఇండస్ట్రీలో మీకు అసలు కాంపిటీషన్ వచ్చే హీరో లేడు’ అని అడిగింది. దీనికి సమాధానమిస్తూ అవుననే బోర్డు చూపించిన నాని.. ‘సక్సెస్ ఫుల్ అయిన ఫ్యామిలీలోని అందరూ సక్సెస్ కాలేదు’ అని మిగతా హీరోల గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇది కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే ఇది ప్రమోషన్ తో పాటు ఫన్ కోసమే చేసినట్లు కనిపిస్తుంది. ఫుల్ ఎపిసోడ్ వస్తేగానీ అసలు విషయం తెలియదు. మరి నాని వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.