ఆస్కార్ బరిలో నిలిచిన RRR సినిమాపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటైన విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు మెగాబ్రదర్ నాగబాబు.
ఆస్కార్ బరిలో నిలిచిన RRR సినిమాపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటైన విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ”ఇప్పుడు వచ్చే ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ యూనిట్ రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే మేము ఆ డబ్బుతో 8 సినిమాలు తీసి మీ ముఖాన కొడతాం. వారు విమాన టికెట్స్ కోసమే అన్ని కోట్లు ఖర్చుపెడుతున్నారు” అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చినీయాంశంగా మారాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు మెగాబ్రదర్ నాగబాబు.
తమ్మారెడ్డి ఆర్ఆర్ఆర్ మీద చేసిన వ్యాఖ్యలపై గత రాత్రి నుంచి నెటిజన్స్ విమర్శిస్తు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై తాజాగా ట్విటర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు మెగాబ్రదర్ నాగబాబు. ట్వీటర్ వేదిగకా ఈ విధంగా రాసుకొచ్చారు నాగబాబు.”ఎవరికి వారే ఇలా అనుకుంటున్నారు. నీయమ్మ మెుగుడు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు..RRRకి ఆస్కార్ కోసం.(#RRR సినిమా మీద కామెంట్ కు వై.సీ.పీ వారి భాషలో)” అంటూ రాసుకొచ్చాడు నాగబాబు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక నాగబాబు కౌంటర్ ను కొందరు నెటిజన్స్ సమర్థిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇలాంటి భాషలోనే బుద్ది చెప్పాలని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి నాగబాబు చేసిన ఘాటైన ట్వీట్ పై తమ్మారెడ్డి భరద్వాజ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
To Whomever It May Concern :
“నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం”
(#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం)
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 9, 2023