Naga Shourya: ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నాగశౌర్య. ఇప్పటివరకు దాదాపు 20 సినిమాల్లో నటించారు. నటనతో పాటు సినిమా మీదున్న అభిమానంతో ప్రొడ్యూషర్గా కూడా మారారు. సహ నిర్మాతగా ఛలో, నర్తనశాల, అశ్వద్ధామ సినిమాలను తెరకెక్కించారు. ఆయన హీరోగా నటిస్తూ.. సహ నిర్మాతగా వ్యవహరించిన ఛలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నాగశౌర్య తాజా చిత్రం ‘లక్ష్య’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక, ‘కృష్ణా వ్రింద విహారి’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాల షూటింగ్ల నేపథ్యంలో సొంత అన్న పెళ్లికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్కు సంబంధించి నాగశౌర్య బిజీగా ఉన్నట్లు సమాచారం.
దీంతో అన్న గౌతమ్ పెళ్లికి హాజరు కాలేకపోయాడంట. ఇక, నాగశౌర్య తోబుట్టువు గౌతమ్ పెళ్లి కర్ణాటకకు చెందిన నమ్రత గౌడతో అంగరంగ వైభవంగా జరిగింది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ అమెరికాలో సెటిల్ కావటంతో అక్కడే పెళ్లి జరిగినట్లు సమాచారం. ఇండియాలో ఉన్న నాగశౌర్య ఆన్లైన్లో పెళ్లికి హాజరయ్యారంట. అన్న, వదినలకు శుభాకాంక్షలు తెలిపారంట. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. మరి, అన్న గౌతమ్ వివాహ వేడుకకు నాగశౌర్య వెళ్లలేకపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Upasana Konidela: మంచి మనసు చాటుకున్న మెగా కోడలు ఉపాసన.. ఇక వారికి అపోలో ఆస్పత్రిలో ఉచిత వైద్యం!