హీరో నాగచైతన్య.. హీరోయిన్లలో తన సీక్రెట్ క్రష్ ఎవరో బయటపెట్టేశాడు. ప్రస్తుతం ఆమె అంటే చాలా ఇష్టమని అన్నాడు. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
అక్కినేని నాగచైతన్య.. ఈ పేరు చెప్పగానే చాలామందికి ఆయన సినిమాల కంటే మాజీ భార్య సమంత గుర్తొస్తుంది. ఎందుకంటే మంచి జంట, అసలు ఎందుకు విడిపోయారు ఇప్పటికీ చాలామంది అభిమానులు బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం సినిమాలతో ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో చైతూ ఓ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అందుకు తగ్గట్లే కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అయ్యాయి. ఇప్పుడు అదంతా కాదన్నట్లు తన సీక్రెట్ క్రష్ గురించి నాగచైతన్య బయటపెట్టాడు. దీంతో ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య, కెరీర్ స్టార్టింగ్ లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా అందుకున్నాడు. సుకుమార్ తో చేసిన ‘100 % లవ్’ హిట్ కొట్టింది. ఆ తర్వాత హిట్, ఫ్లాప్ సంగతి పక్కనబెడితే నటుడిగా మంచి మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అలా తమిళంలో వైవిధ్యమైన సినిమాలు తీస్తాడనే పేరున్న వెంకట్ ప్రభు డైరెక్షన్ లో నటించాడు. దానిపేరు ‘కస్టడీ’. మే 12న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పలు ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెడుతున్నాడు.
ఓ ఫుడ్ వ్లాగర్ తో ఇంటర్వ్యూలో భాగంగా ‘ప్రస్తుతమున్న హీరోయిన్లలో సీక్రెట్ క్రష్ ఎవరు?’ అని చైతూని అడగ్గా, ‘ఈ మధ్య ‘బాబీలోన్’ అనే ఇంగ్లీష్ సినిమా చూశాను. అందులో యాక్ట్ చేసిన మార్గట్ రాబీ ఫెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయ్యాను. ప్రస్తుతానికైతే ఆమెపై చాలా అంటే చాలా క్రష్(ఇష్టం) ఉంది’ అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియో కింద మాత్రం హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పేరు పెడుతున్నారు. ఎందుకంటే రీసెంట్ టైంలో వీళ్లిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారని తెగ రూమర్స్ వస్తున్నాయి. మరి నాగచైతన్య, హీరోయిన్ పై క్రష్ ఉందనగానే మీరేం అనుకున్నారు? కింద కామెంట్ చేయండి.