ఆమెని చూడటానికి భలే ముద్దుగా ఉంటుంది. చిట్టి పొట్టి బట్టలు వేసుకుందంటే.. మీరు అలా చూస్తూ ఉండిపోవడం గ్యారంటీ. రీసెంట్ టైంలో అయితే మరింత రెచ్చిగొట్టేలా ఫొటోలు పోస్ట్ చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?
అవకాశాలు అస్తమానం రావు. వచ్చినప్పుడే వాటిని సరిగా ఉపయోగించుకోవాలి. ఒకవేళ లేటయిపోతే మాత్రం ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి అలానే హీరోయిన్ అయింది. స్టార్ హీరో సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. వరసగా సొంత ఇండస్ట్రీలో మూడు సినిమాలు చేసి, ఆ వెంటనే తెలుగులోకి ఎంటరైపోయింది. మూడేళ్ల గ్యాప్ లో ఏకంగా ఏడు మూవీస్ లో నటించింది. ఆ తర్వాత యాక్సిడెంట్ కావడంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైపోయింది. ఇప్పుడు మళ్లీ వచ్చింది గానీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆమెని సరిగా పట్టించుకోవడం లేదు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక విషయానికొస్తే.. కర్ణాటకలో శృంగేరిలో పుట్టిన ఈ భామకు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఈ క్రమంలోనే స్కూల్ ఏజ్ లోనే నాటకాలు, డ్యాన్సులు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అలా టీనేజ్ లోనే మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. పలు యాడ్స్ లో నటించి ఫేమ్ తెచ్చుకుంది. ఆమెనే నభా నటేష్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ‘వజ్రకాయ’ మూవీతో హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. కన్నడలోనే ‘లీ’, ‘సాహెబా’ అనే చిత్రాల్లోనూ నటించింది. ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అలా మరో ఆరు తెలుగు మూవీస్ లో హీరోయిన్ గా చేసింది.
ఈమె తెలుగులో ఏడు సినిమాలు చేస్తే అందులో ఒక్క సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. అదే ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పి మరీ ఆకట్టుకుంది. 2021లో వచ్చిన ‘మ్యాస్ట్రో’లో చివరగా నటించింది. ఆ తర్వాత రోడ్ యాక్సిడెంట్ లో గాయపడి దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరమైంది. గతేడాది ఇన్ స్టాలో ఈ విషయాన్ని చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కేక పుట్టించే ఫొటోలు పోస్ట్ చేస్తూ దర్శకనిర్మాతల కంట్లో పడాలని చూస్తోంది. మరి ఆమె ప్రయత్నం ఫలించి హీరోయిన్ గా అవకాశాలు వస్తాయా అనేది చూడాలి? మరి పైన పాప ఫొటో చూడగానే ఆమెని ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.