తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన నటుడు మురళీ మోహన్. నటుడిగానే కాకుండా నిర్మాతగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు. రాజకీయాల్లో కూడా తన సత్తా చాటారు.
తెలుగు ఇండస్ట్రీలో నటుడు మురళీ మోహన్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. హీరోగా నటించి తర్వాత క్యారెక్టర్ పాత్రల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. నిర్మాతగా పలు హిట్ చిత్రాలు అందించారు. జయభేరి గ్రూప్ అధినేత.. తెలుగు దేశం పార్టీ తరుపు నుంచి ఎంపీగా రాజమండ్రి నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజాగా మురళీ మోహన్ నంది అవార్డులపై మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
మురళీ మోహన్ నందీ అవార్డుల విషయంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. 1964 లో నంది అవార్డల ప్రధానోత్సవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం అయ్యింది. దేశంలో ఈ రాష్ట్రమైనా లేదా కేంద్ర అయినా సరే అవార్డులు ఇవ్వడం పరిపాటి.. ప్రైవేట్ సంస్థలు ఎన్ని అవార్డులు ఇచ్చినా.. ప్రభుత్వం తరుపు నుంచి అవార్డు అందుకోవడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది.. గౌరవం ఉంటుంది. చాలా కాలం వరకు అవార్డుల ఉత్సవాలు దేదీప్యమానంగా వెలిగిపోయినప్పటికీ.. గత ఏనిమిది సంవత్సరాల నుంచి ఈ అవార్డులు ఇవ్వడం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి అవార్డులు కైవసం చేసుకున్న స్థాయిలో ఉన్నటప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నుంచి ఎలాంటి గుర్తింపు రావడం లేదని నిరుత్సాహం వ్యక్తం చేశారు మురళీ మోహన్.
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఇద్దరుముఖ్య మంత్రులకు అవార్డుల విషయం గురించి చెప్పినా చేద్దాం.. చూద్దాం అనే పందాలోనే ఉన్నారు. అలా చూడటం చాలా చిన్నచూపుగా అనిపించింది. నంది సినిమా అవార్డులు, నంది టీవీ అవార్డులు, నాటక రంగానికి చెందిన అవార్డుల అన్నింటితో పాటుగా కవులను హంస అవార్డులతో సత్కరించే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది.. పూర్వ కాలం నుంచి కవులను, కళాకారులను తగు రీతిలతో సత్కరించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తాయంటే చాలా గౌరవం ఉంటుంది. అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. అనేక సందర్భాల్లో, పలు వేధికలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రభుత్వం నుంచి కళాకారులకు లభించే గుర్తింపు ఇవ్వండి అంటూ అభ్యర్థించాం.. కానీ స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు మురళీ మోహన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరు ముఖ్యమంత్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులు కార్యక్రమాలు చేశారు అన్నారు.