Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. ఈ మధ్య కాలంలో తెలుగు నాట ఓ ట్రెండింగ్ పేరుగా మారిపోయింది. ‘సీతా రామమ్’ సినిమాలో సీతగా మృణాల్ కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టారు. ఓ సైనికుడి ప్రేమలో పడి, రాజ భోగాల్ని వదిలే రాకుమారి పాత్రలో అద్భుతంగా నటించారు. నటించారు అనటం కంటే జీవించారు అని చెప్పటం బాగుంటుంది. ఇక, యువకులు తమకు కూడా ఇలాంటి ఓ అమ్మాయి దొరికితే బాగుండు అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని వారాల నుంచి మృణాల్ ఠాకూర్‌కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ వస్తున్నాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలోవర్స్ సైతం భారీగా పెరిగిపోయారు. ఇక, ఆమెకు సంబంధించిన ప్రతీ విషయం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజాగా, మృణాల్‌కు సంబంధించిన పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో ఆమె ప్రస్తుతం ఉన్న మేని రంగు కంటే భిన్నంగా కనిపిస్తున్నారు. చేతులు, ముఖం మొత్తం నల్లగా ఉన్నాయి. ఆమె తన చేతుల్ని పైకి ఎత్తి చూపిస్తూ ఉంది. అయితే, ‘సీతారామమ్’ సినిమాలో సీతకు, ఆ ఫొటోలోని మృణాల్‌కు ఎక్కడా పోలిక లేదంటున్నారు నెటిజన్లు. మృణాల్ ఏంటి ఒరిజినల్‌గా మరీ ఇంత నల్లగా ఉందని వాపోతున్నారు. మరికొంతమంది మాత్రం.. మృణాల్ స్కిన్ అలర్జీకి గురైందని, అందుకే ఆమె చేతులు, ముఖం కమిలిపోయి నల్లగా మారాయని అంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న బిల్డింగ్ ఆసుపత్రి అని అంటున్నారు.
అయితే, ఈ ఫొటో వెనకాల ఉన్న వాస్తవాలు ఏమిటో ఎవరికీ తెలియటం లేదు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ ఫొటో ఎప్పటిది అన్నది కూడా తెలియటం లేదు. ఏదైనా సినిమా కోసం ఆమె అలా గెటప్ మార్చారా అన్న దానిపై కూడా క్లారిటీ లేదు. అసలా ఫొటో గుట్టు వీడాలంటే మృణాల్ నేరుగా స్పందించాల్సిందే. ఇక, మృణాల్ ఠాకూర్ కుంకుమ భాగ్య అనే హిందీ సిరియల్‌తో పాపులారిటీ తెచ్చుకున్నారు. ఈ సీరియల్ తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణ తెచ్చుకుంది. సీరియల్స్‌లో రానించిన తర్వాత మృణాల్ ‘సూపర్ 30’, జర్సీ వంటి సినిమాల్లో నటించారు. ‘సీతారామమ్’ తెలుగులో మృణాల్ మొదటి సినిమా. మరి, ఈ ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vishnu priya: సినిమా ఛాన్స్ ఇస్తాం.. కోరిక తీరుస్తావా అని అడిగారు: విష్ణుప్రియ