చిత్రపరిశ్రమకి సంక్రాంతి సీజన్ అనేది బాగా కలిసొచ్చే అంశం. ప్రతి ఏడాది సంక్రాంతి వస్తుందంటే చాలు.. స్టార్ హీరోల నుండి కుర్రహీరోల వరకు తమ సినిమాలను రిలీజ్ కి రెడీ చేస్తుంటారు. సంక్రాంతి బరిలో విడుదలై సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. కలెక్షన్స్ కి తిరుగుండదు. దాదాపు విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే.. ఫెస్టివల్ సీజన్స్ అంటే హీరోలకే కాదు.. ప్రేక్షకులకు కూడా పండగే. ఓవైపు సంక్రాంతి.. మరోవైపు సినిమాలు.. ప్లాన్స్ అన్నీ ఇలా సెట్ చేసుకుంటారు. అయితే.. రాబోయే సంక్రాంతికి ఒక నెల టైమ్ మాత్రమే ఉంది. దీంతో ఇప్పటినుండే స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
2023.. సంక్రాంతికి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పెద్ద సినిమాల మాస్ జాతర జరగబోతుంది. ఓవైపు తెలుగులో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ‘వీర సింహా రెడ్డి’.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు రిలీజ్ అవుతుండగా.. కోలీవుడ్ నుండి దళపతి విజయ్ హీరోగా ‘వారసుడు’, తలా అజిత్ హీరోగా ‘తునివు’ సినిమాలు రెడీ అవుతున్నాయి. టాలీవుడ్ లో బాలయ్యకి, చిరంజీవి సినిమాల మధ్య రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే కోలీవుడ్ లో అజిత్ – విజయ్ సినిమాల మధ్య పోటీ వాతావరణం ఎలా ఉంటుందో తెలిసిందే. ఈ నలుగురికి మాస్ ఫ్యాన్ బేస్ పీక్స్ లో ఉంటుంది.
కాగా, 2023 సంక్రాంతి ఒకేసారి ఈ నాలుగు సినిమాలు సందడి చేయనున్నాయి. వీటిలో తునివు, వారిసు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుండగా.. వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు తెలుగులో రిలీజ్ కానున్నాయి. అయితే.. ఈ నాలుగు సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయని ఫ్యాన్స్ కి తెలుసు. కానీ.. ఏ డేట్ లో రాబోతున్నాయి అనే విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీర సింహ రెడ్డి, వాల్తేరు వీరయ్య, తునివు, వారసుడు సినిమాల రిలీజ్ డేట్స్ పై ఆయా సినిమాల డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి బరిలో ముందుగా అజిత్ ‘తునివు’ మూవీ సిద్ధం అవుతోంది. జనవరి 11న(బుధవారం) తునివు రిలీజ్ కన్ఫర్మ్ చేసుకుంది. ఆ తర్వాత రోజు జనవరి 12న(గురువారం) దళపతి విజయ్ ‘వారసుడు’, బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ రిలీజ్ కానున్నాయి. ఇక జనవరి 13న(శుక్రవారం) చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా బరిలో దిగనున్నాడు. ఇలా నలుగురు స్టార్ హీరోలు ఒకేసారి సంక్రాంతి పోటీకి రాబోతుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సినిమాలన్నీ కలెక్షన్స్ బట్టి హిట్/ప్లాప్ అవుతున్నాయి.. కాబట్టి, ఏ సినిమా ఎంత రాబడుతుందో చూడాలని భావిస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి మాస్ జాతరకి రంగం సిద్ధమైంది. కాబట్టి.. ఫ్యాన్ వార్స్, సెలబ్రేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ఇప్పటికే ఆయా సినిమాల నుండి ప్రమోషన్స్ మొదలైపోయాయి. చూడాలి మరి బాక్సాఫీస్ రచ్చ గెలిచేది ఎవరో..!
#thunivu #VeeraSimhaaReddy #varisu #waltairveerayya#tollywoodactress #Tollywood #SumanTV pic.twitter.com/GXXvbccLxy
— SumanTV (@SumanTvOfficial) December 1, 2022