Mohan Babu: టాలీవుడ్ మంచు హీరోలు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ఈరోజు తిరుపతి కోర్టులో హాజరుకానున్నారు. తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి కోర్టు వరకూ ఈ ముగ్గురు హీరోలు పాదయాత్రగా వెళ్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 2019 మార్చి 22న మోహన్ బాబు, విష్ణు మరియు మనోజ్ లపై స్టూడెంట్స్ ఫీజ్ రీయింబర్స్ మెంట్ విషయంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని రంగంపేటలో ఉన్న శ్రీవిద్యానికేతన్ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఉల్లంఘిస్తూ రోడ్డుపై ధర్నా చేసినందుకు చంద్రగిరి పోలీసులు వీరి ముగ్గురిపై కేసు రిజిస్టర్ చేశారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఫండ్స్ ఇవ్వలేదని గత ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతూ మోహన్ బాబు ధర్నా చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోవట్లేదని నిలదీస్తూ.. విద్యార్థులు, సిబ్బందితో కలిసి మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లు బైఠాయించారు. దీంతో తిరుపతి – మదనపల్లి హైవేపై ట్రాఫిక్ అంతరాయడం కలగడంతో.. అప్పటి ఎంపీడీఓ, ఎంసీసీ టీమ్ ఆఫీసర్ హేమలత.. ఎలక్షన్ ఆఫీసర్స్ నుండి లేదా పోలీసు శాఖ నుండి అనుమతులు లేకుండా ధర్నాకు దిగారంటూ చంద్రగిరి పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఈ విషయంలో మంచు హీరోలతో పాటు శ్రీ విద్యానికేతన్ ఏవో తులసీనాయుడు, పీఆర్వో సతీష్ లపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఐపీసీ 290, 341, 171(ఎఫ్) రెడ్ విత్ 34 సెక్షన్స్ తో పాటు పోలీస్ యాక్ట్ 34 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లు కోర్టుకు హాజరు కానున్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.