బొడ్డుపల్లి శ్రీను.. జబర్దస్త్ శ్రీను, గెటప్ శ్రీను పేరు ఏదైనా ఇచ్చేది మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్, చేసేది కామెడీనే. జబర్దస్త్‌లో తక్కువ కాలంలోనే తనేంటో నిరూపించుకుని బుల్లితెర కమల్ హాసన్ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు. ఎవరినైతే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడో ఆయనతోనే నటించి శభాష్ అనిపించుకున్నాడు. బుల్లితెర షోలే కాదు.. వెండితెర మీద కూడా అవకాశాలు దక్కించుకుని ఫుల్ బిజీ అయిపోయాడు. తాజాగా గెటప్ శ్రీను వివాహ వార్షికోత్సవం సందర్భంగా మెగాస్టార్ నుంచి పెద్ద సర్‌ప్రైజే పొందాడు. తన అభిమానులను మెగాస్టార్ ఎలా ఆదరిస్తారో.. ఎలా సర్‌ప్రైజ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సందర్భాల్లో మనం చూశాం కూడా. ఇప్పుడు అలా సర్‌ప్రైజ్ కావడం గెటప్ శ్రీను వంతైంది.
ఇదీ చదవండి: ఐపీఎల్ 2022: లక్నో తరఫున ఆడనున్న ఆ ఐదుగురు ఉత్తరప్రదేశ్ ప్లేయర్లు!
బుల్లితెరపై చాలా సందర్భాల్లో చిరంజీవిలా నటించి శ్రీను అందరి మన్ననలు పొందాడు. చిరంజీవికి కూడా గెటప్ శ్రీను అంటే ఎంతో అభిమానం. గెటప్ శ్రీను ఫ్యామిలీ అంటే చిరుకు చాలా ఇష్టం. యాక్టింగ్ పరంగానూ శ్రీను చిరు మంచి మార్కులే వేశారు. ఇటీవల పెళ్లిరోజు సందర్భంగా గెటప్ శ్రీనును సర్‌ప్రైజ్ చేద్దామని మెగాస్టార్ భావించారు. అనుకున్నదే తడవుగా శ్రీనుకు కేక్, స్వీట్స్, నూతన వస్త్రాలు అన్ని ఇచ్చి.. ఎప్పటిలాగే బొకేతో ఆశ్చర్యపరిచారు. ఆ విషయాన్ని స్వయంగా శ్రీనునే తన సోషల్ మీడియా అకౌంట్లలో తన అభిమానులతో పంచుకున్నాడు. ‘ఈ యానివర్సరీ ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ముఖ్యంగా మీరు ఆశీర్వదించారు. ఐ లవ్ యూ సార్’ అంటూ గెటప్ శ్రీను తన ఆనందాన్ని పంచుకున్నాడు.