Megastar Chiranjeevi: వెండి తెర బల్లాల దేవుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం చిత్ర ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా, ‘విరాట పర్వం’ ప్రమోషన్ కోసం రానా, సాయి పల్లవిలు ఇండియన్ ఐడల్ తెలుగు మెగా ఫినాలేకు వెళ్లారు. ఈ మెగా ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగింగ్ షోలో చిరంజీవి సందడి చేశారు. కంటెస్టెంట్లతో కలిసిపోయి అందర్నీ ఖుషీ చేశారు. ఈ సందర్భంలోనే మెగాస్టార్.. రానాకు సంబంధించిన ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్పి అందరి ముందు రానాను బుక్ చేశారు.
షోలో రానా మాట్లాడుతూ.. ‘‘నేను టెన్త్, ఇంటర్‌లో ఉన్నపుడు…’’ అని చెప్పగా.. ఆ వెంటనే చిరంజీవి స్పందిస్తూ ‘‘ నేను దాని ఎక్స్‌టెన్సన్ చెప్తాను. చరణ్ బాబు గదిలో కిటికీ తలుపుల గ్రిల్ తీశావు’’ అని అన్నారు. దీంతో రానా నోరెళ్ల బెట్టి వెనక్కు తిరిగారు. తల పట్టుకుని ఉండిపోయారు. మెగాస్టార్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్‌తో అక్కడున్న వారంతా నవ్వటం ఆరంభించారు. అయితే, రానా ఏం చెప్పాడు?..దానికి కొనసాగింపుగా మెగాస్టార్ ఏమన్నారు?.. ఆ రోజు ఏం జరిగింది? అన్నది సస్పెన్స్.. అది తెలియాలంటే జూన్ 17వ తేదీన జరిగే ఇండియన్ ఐడల్ తెలుగు మెగా ఫినాలే చూసి తీరాల్సిందే. కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రానా దగ్గుబాటి మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చాలా వేధికలపై ఇద్దరూ చాలా సార్లు చెప్పారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 30 Years Industry Prudhvi Raj: ప్రజల్లో మార్పు వచ్చింది! 2024లో పవన్ కళ్యాణే సీఎం: 30 ఇయర్స్ పృథ్వి!