రైతు దేశానికి వెన్నుముక లాంటివాడు. అన్నదాత అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం మెతుకు రాదు.. డిసెంబర్ 23న జాతీయ జాతీయ రైతుదినోత్సవం జరుపుకున్నాం.. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి రైతన్నకు తనదైన శైలిలో శుభాకాంక్షలను చెప్పారు. పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. అంతే కాకుండా రైతులందరికీ చిరంజీవి సెల్యూట్ కూడా చెప్పారు.
ప్రకృతి చాలా గొప్పదని, ఒక్క విత్తు నాటితే అది ఎంతో మందికి కడుపు నింపుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రకృతి పట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో ఉండాలని పిలుపునిచ్చారు. తన ఇంటి పెరట్లో ఆనపకాయ (సొరకాయ) విత్తనం నాటితే అది, మొక్క మొలిచి తీగలా మారి కాయలు కాసిందని వెల్లడించారు. తాను నాటిన విత్తు పెద్ద పాదులా మారి, రెండు కాయలు కాసిందని తెలిపారు. అంతేకాదు, స్వయంగా ఆయనే ఓ కాయను కోసి మురిసిపోయారు.
ఇది కూడా చదవండి : 36లోను వర్కవుట్స్ తో హీట్ పుట్టిస్తున్న జయమ్మ
ఇంట్లో ఒక తొట్టిలోనైనా విత్తనం నాటండి… స్వయంగా పండించిన కూరగాయలతో వండిన వంట ఎంతో రుచికరంగా ఉంటుందని చిరంజీవి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి చిరంజీవి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదలకి సిద్ధంగా ఉండగా, ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్‌లతోపాటు బాబీ సినిమాతోను బిజీగా ఉన్నారు.
#NationalFarmersDay ❤️🙏pic.twitter.com/FMwbX7huUg
— Chiranjeevi Trends™ (@TrendsChiru) December 23, 2021