సీనియర్ నటి, హీరోయిన్ మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో తెలుగు సినిమాలలో స్టార్స్ అందరి సరసన నటించిన మీనా.. ఇటీవలే తన భర్తను కోల్పోయింది. మీనా భర్త సాగర్ మరణం తర్వాత తీవ్ర శోకం నుండి త్వరగా బయటపడి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ చేస్తూ.. తనని తాను బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. అడపాదడపా తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ని కలుస్తోంది.
ఇక తాజాగా మీనాతో పాటు మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్స్ రంభ, సంఘవి, సంగీత వారి కుటుంబ సభ్యులతో వెళ్లి మీనాను పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మీనా తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. భర్త చనిపోయిన తర్వాత మీనా పోస్ట్ చేసిన తొలి పోస్ట్ ఇది. ఇప్పుడిప్పుడే మీనా సాధారణ జీవితానికి అలవాటు పడుతోంది. 90లలో మీనాతో సహా రంభ, సంగీత, సంఘవి హీరోయిన్స్‌గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మీనా మాత్రం నటిగా యాక్టివ్ గా ఉంది. ఆమె సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా అప్పుడప్పుడు ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక మీనా భర్త సాగర్ ఈ ఏడాది జూన్ లో ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూశారు. ఆ సమయంలో సాగర్ మరణంపై సోషల్ మీడియాలో పలు రకాలైన వార్తలు వినిపించాయి. అప్పటినుండి మీనాకు సహచర నటీనటులు అండగా ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో ప్రస్తుతం మీనా.. రంభ, సంఘవి, సంగీతలతో క్లోజ్ గా ఉంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి మీనా తొలి పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.