Poovaiyar: సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి బాల నటుడిగా దూసుకెళుతున్నాడు ‘పూవైయ్యార్’. సూపర్ సింగర్ జూనియర్ 6లో రన్నర్ అప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2019లో ‘నాప్తే తునై’ సినిమాలో సింగర్ హిప్హాప్ తమిళతో కలిసి ఓ పాటను పాడాడు. అదే అతడి మొదటి సినిమా. తర్వాత దళపతి విజయ్ సినిమా ‘బిగిల్’లో ‘వెరితనమ్’ అనే పాటకు కో సింగర్‌గా స్వరాన్ని అందించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో పాటలు పాడాడు. తాను పాట పాడిన ‘బిగిల్’ సినిమాలోనే గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. నటుడిగా ఇది పూవైయ్యార్ మొదటి సినిమా. ఆ తర్వాత విజయ్‌తో మాస్టర్ సినిమాలోనూ నటించాడు. ఈ సినిమాలో అతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తర్వాత కోబ్రాలోనూ నటించాడు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘అంధాదూన్’ రీమేక్‌లోనూ నటిస్తున్నాడు.
ఈ సినిమా తమిళంలో ‘అంధగాన్’గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ అంధుడిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం పూవైయ్యార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పూవైయ్యార్ కొత్త కారు కొన్నాడు. అతడు కొత్త కారు దగ్గర దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 13 ఏళ్లకే పూవైయ్యార్ కారు కొనటంపై సోషల్ మీడియా వేదికగా కొంతమంది నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్లు ‘‘చిన్న పిల్లాడికి కారు ఎందుకు?’’.. ‘‘ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోలేని వయసులో కారు కొని ఏం చేస్తావు?’’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
Poovaiyar With His New Car 🤩❤️#Poovaiyar pic.twitter.com/8NTFrehdes
— Behindwoods (@behindwoods) October 11, 2022