విక్టరీ వెంకటేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ 'మల్లీశ్వరి'. ఇందులో డాలీ అనే క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ మీలో ఎంతమందికి గుర్తుంది? ఇప్పుడామె ఎలా ఉందో తెలుసా?
మళ్లీ మళ్లీ చూడాలనిపించే తెలుగు సినిమాల్లో ‘మల్లీశ్వరి’ ఒకటి. వెంకటేష్ హీరోగా చేసిన ఈ మూవీ.. ఎప్పుడు చూసినా సరే తొలిసారి చూసినంత కొత్తగా ఉంటుంది. కామెడీ మనల్ని కితకితలు పెట్టిస్తుంది. ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్.. మనలో చాలామందికి ఇప్పటికీ దాదాపు గుర్తుంది. అందులో వెంకటేష్ అన్నయ్య కూతురు డాలీగా ఓ చిన్నారి నటించింది. ఆమె ఉన్నది ఒకటి రెండు సీన్లే అయినా మనకు గుర్తుండిపోయింది. ఇప్పుడామెనే పెరిగి చాలా పెద్దమ్మాయి అయిపోయింది. తాజాగా ఆమె ఫొటోలు చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు.
ఇక విషయానికొస్తే.. ‘మల్లీశ్వరి’ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు గ్రీష్మ నేత్రి. ఈ మూవీతో పాటు కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ప్రస్థానం, దుబాయి శీను, అశోక్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి 30 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఓవైపు యాక్ట్ చేస్తూనే మరోవైపు చదువు కూడా పూర్తి చేసింది. గతేడాది హైదరాబాద్ లోని VNR కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. పూర్తిస్థాయి నటిగా మారే ప్రయత్నాల్లో ప్రస్తుతం ఉంది. అందులో భాగంగా ఫొటోషూట్స్ చేస్తూ తన వంతుగా దర్శకనిర్మాతల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె చిన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈ స్టోరీకి కారణమైంది.
గ్రీష్మ అక్క కూడా నటి కావడం విశేషం. ఆమె పేరు శ్రావ్య. ‘లవ్ యూ బంగారం’ మూవీలో హీరోయిన్ గానూ చేసింది. టీనేజ్ లో ఉన్నప్పుడు ‘భీష్మ’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాల్లో అలా తళుక్కున మెరిసిన ఈమె.. దిల్ రాజు ప్రొడక్షన్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అదే విషయాన్ని చెప్పుకొచ్చింది. సో అదన్నమాట విషయం. మనం చూసిన చైల్డ్ ఆర్టిస్టులు అందరూ పెద్దోళ్లు అయిపోయారు. గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. మరి ‘మల్లీశ్వరి’ పాప గురించి మీలో ఎంతమంది తెలుసు? కింద కామెంట్ చేయండి.