హీరోయిన్ సానియా అయ్యప్పన్.. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ఓ మాల్ కి వెళ్లింది. ఫ్యాన్స్ ని చూసి ఉబ్బితబ్బిబ్బి అయిపోయింది. వాళ్లందరితో ముచ్చటించింది. ప్రోగ్రాం పూర్తి చేసుకుని రిటర్న్ వెళ్తుంటే.. అక్కడే ఉన్న కొందరు ఆకతాయిలు.. ఆమెతో పాటు మరో నటితో అసభ్యంగా ప్రవర్తించారు. ఎక్కడపడితే అక్కడ టచ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె అస్సలు ఊరుకోలేదు. సదరు ఆకతాయి గూబ పగలగొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా హీరోహీరోయిన్లు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. వాళ్లని అభిమానించే వ్యక్తులు లక్షల్లో, స్టార్స్ అయితే కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. అభిమానం వెర్రితలలు వేసినప్పుడు, ఆకతాయి పనులు చేస్తుంటారు. బహుశా అందుకేనేమో హీరో బాలకృష్ణ.. చెంపదెబ్బలు కొడుతూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. హీరోల విషయంలోనే కాదు హీరోయిన్లకు కూడా అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. మలయాళ ప్రముఖ హీరోయిన్ సానియా అయ్యప్పన్ కి కూడా తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది.
సానియా హీరోయిన్ గా చేసిన ‘శాటర్ డే నైట్’ మూవీ.. అక్టోబరు 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొళికోడ్ లో ప్రచారం నిర్వహించారు. ఆ నగరంలోని హైలెట్ మాల్ కి వెళ్లారు. ఈవెంట్ అంతా బాగానే జరిగింది. జనాలు కూడా భారీగానే వచ్చారు. కానీ సానియా బయటకు వెళ్లిపోయే క్రమంలో.. ఆమెపై ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు. చుట్టూ బాడీగార్డ్స్ ఉన్నప్పటికీ పరిస్థితి చేయి దాటిపోయింది. పలువురు కుర్రాళ్లు.. హద్దులు దాటేసి హీరోయిన్ మీదకి వచ్చారు. ఎక్కడపడితే అక్కడ టచ్ చేసి లైంగికంగా వేధించారు. దీంతో సహనం కోల్పోయిన సానియా.. సదరు ఆకతాయిలపై చేయి చేసుకుంది. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ విషయమై ఇన్ స్టాలో సానియా పోస్ట్ కూడా పెట్టింది. మరి ఫ్యాన్స్ పై సానియా చేయి చేసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: అమ్మాయిని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? రిపోర్టర్ పై రెజీనా సీరియస్!