యంగ్ హీరోయిన్ రెజీనా.. చాలారోజుల గ్యాప్ తర్వాత తెలుగులో ‘శాకిని డాకిని’ సినిమా చేసింది. అడ్వంచర్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో రెజీనాతో పాటు హీరోయిన్ నివేదా థామస్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 16న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే మూవీని ప్రమోట్ చేసేందుకు ప్రెస్ మీట్ పెట్టగా… అందులో ఓ రిపోర్టర్ వింత ప్రశ్న అడిగారు. దీంతో హీరోయిన్ రెజీనా ఫుల్ సీరియస్ అయింది. ఇలాంటి ప్రశ్నలా అడిగేది అని అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా సెలబ్రిటీలకు అప్పుడప్పుడు విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి కొందరు సమాధానం చెప్పడానికి ఇష్టంలేక సైలెంట్ అయిపోతే.. మరికొందరు మాత్రం స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తుంటారు. ఇప్పుడు అలాంటి సంఘటనే హీరోయిన్ రెజీనా విషయంలో జరిగింది. ‘ఎవరు’ మూవీలో కీలకపాత్రలో మెప్పించిన రెజీనా.. ఆ తర్వాత ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఈ మధ్యలో 1945 సినిమాలో హీరోయిన్ గా, ‘ఆచార్య’ స్పెషల్ సాంగ్ చేసింది.ఇక ఇప్పుడు రెజీనానే ప్రధాన పాత్రలో నటించిన ‘శాకిని డాకిని’ విడుదలకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ పెట్టగా.. ‘ఇందులో మీ పాత్రకు ఓసీడీ ఉంది. రియల్ లైఫ్ లో కూడా మీకు అలా ఓసీడీ..’ అని ఓ రిపోర్టర్ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నపై సీరియస్ గా రియాక్ట్ అయిన రెజీనా.. ‘సినిమాలో అమ్మాయిల గురించి గొప్పగా చూపించాం. వాటి గురించి కాకుండా ఇలాంటి క్వశ్చన్సా అడిగేది’ అని సీరియస్ అయింది. నిజ జీవితంలో తను చాలా పరిశుభ్రతతో ఉంటానని, ఓసీడీ లాంటివి ఏం లేవని చెప్పింది. అలానే అమ్మాయిలకు పీరియడ్స్ లాంటివి ఉంటాయి కాబట్టి చాలా పరిశుభ్రతతో ఉంటామని కూడా హీరోయిన్ రెజీనా క్లారిటీ ఇచ్చింది. కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’కి తెలుగు రీమేక్ ‘శాకిని డాకిని’. అందులో ఇద్దరబ్బాయిలు లీడ్ రోల్స్ చేయగా, తెలుగుకి వచ్చేసరికి యంగ్ హీరోయిన్స్ తో తీశారు. సుధీర్ వర్మ దర్శకుడు. మరి రిపోర్టర్ పై రెజీనా సీరియస్ కావడం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: నా గురించి అలా అనుకోవడానికి కారణం ఫిజిక్ అయ్యుండొచ్చు: రెజీనా