అతడు యువహీరో.. కెరీర్ ప్రారంభంలో సహాయపాత్రల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం పలు చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు. తాజాగా ‘చట్టంబి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సినిమాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ ఇంతలో అతడిపై పోలీసు కేసు నమోదైంది. యాంకర్ తో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంగా అరెస్ట్ చేశారు. తనని అగౌరవపరిచినందుకే, తను సహనం కోల్పోయానని.. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నట్లు పోలీస్ విచారణలో సదరు హీరో పేర్కొన్నాడు. ఇప్పుడీ విషయం మలయాళ ఇండస్ట్రీలో సంచలనమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళ ప్రముఖ నటుడు శ్రీనాథ్ బాసీని పోలీసులు అరెస్ట్ చేశారు. తను హీరోగా చేసిన ‘చట్టంబి’ మూవీ తాజాగా రిలీజైంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ జరిగింది. ఇందులో ప్రముఖ యాంకర్ వీణపై శ్రీనాథ్ సీరియస్ అయ్యాడు. దీంతో శ్రీనాథ్, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వీణ.. కేరళలోని మరడు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. ఇంటర్వ్యూ మధ్యలో తనని దూషించాడని ఆమె తన కంప్లైంట్ లో పేర్కొంది. అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది. ఈ మేరకు 354, 509, 294 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక అరెస్ట్ అయిన కాసేపటికే హీరో శ్రీనాథ్.. బెయిల్ పై బయటకొచ్చేశాడు. తన అరెస్ట్ ని ఖండించాడు. యాంకర్ వీణ.. తనని అగౌరవపరిచేలా ప్రశ్నలు అడిగిందని, అందుకే తను సహనం కోల్పోయానని.. పోలీసు విచారలో శ్రీనాథ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కుంబలంగి నైట్స్, కప్పెలా, భీష్మపర్వం తదితర సినిమాల్లో శ్రీనాథ్.. కీలకపాత్రల్లో నటించాడు. ప్రస్తుతం ‘చట్టంబి’ సినిమాలో హీరోగా చేశాడు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇలాంటి సమయంలో అరెస్ట్, బెయిల్ అని రచ్చ కావడంతో శ్రీనాథ్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. మరి శ్రీనాథ్ అరెస్ట్ గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: నా పేరుతో స్కాం చేస్తున్నారు.. అభిమానులకు సన్నీ లియోన్ హెచ్చరిక