సూపర్ స్టార్ మహేష్ తో చేయబోయే కొత్త సినిమా కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకటి రెండు కాదు ఏకంగా అన్ని పార్ట్స్ గా ఈ మూవీని తీయనున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది?
తెలుగు సినిమాకు ‘ఆస్కార్’ వస్తుందా అని ఎవరైనా అంటే.. అబ్బో అది అసాధ్యం అనుకునేవారు. కానీ దాన్ని రియాలిటీలో సాధించి చూపించాడు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఓ సాధారణ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. ఇప్పుడు గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’తో తన రేంజ్ ని హాలీవుడ్ వరకు తీసుకెళ్లిపోయాడు. దీంతో జక్కన్న నెక్స్ట్ మూవీపై బీభత్సమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. అదే టైంలో ఆ మూవీ గురించి బయటకొస్తున్న ఒక్కో అప్డేట్ కూడా మైండ్ బ్లోయింగ్, అన్ బిలీవబుల్ అనిపిస్తుంది. తాజాగా SSMB29పై వచ్చిన ఓ అప్డేట్ ఫ్యాన్స్ సంతోషానికి కారణమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ మరికొన్ని నెలల్లో పూర్తవుతుంది. అంతలో రాజమౌళి సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి గతంలో మాట్లాడిన జక్కన్న.. ‘గ్లోబ్ ట్రాటింగ్ అడ్వంచెర్’ స్టోరీతో ఇది ఉండబోతుందని చెప్పాడు. మరోవైపు రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఫారెస్ట్ అడ్వంచర్ అంటూ పలు ఇంటర్వ్యూల్లో హైప్ మరింత పెరిగేలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదంతా కాదన్నట్లు SSMB29ని ఏకంగా మూడు భాగాలుగా (ట్రైయాలజీ) తీయనున్నారనే వార్త వైరల్ గా మారింది.
‘బాహుబలి’లో సీక్వెల్ ట్రెండ్ కు సరికొత్తగా శ్రీకారం చుట్టిన రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ని కూడా అలానే తీస్తానని హింట్ ఇచ్చాడు. ప్రస్తుతానికి ఇది ఓ పార్ట్ మాత్రమే వచ్చింది. ఫ్యూచర్ లో దీనికి సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పాడు. ‘బాహుబలి’ కోసం ఐదారేళ్లు టైమ్ తీసుకున్న రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ ఒక్కదాని కోసం ఏకంగా నాలుగేళ్లు స్పెండ్ చేశాడు. ఇప్పుడు మహేష్ తో మూడు భాగాలు అంటే.. ఈజీగా పదేళ్లు పడుతుంది. ఇదిలా ఉండగా మహేష్ తో తీయబోయే ఈ మూవీలో మన స్టార్ యాక్టర్స్ తోపాటు హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తారనే టాక్ ఉంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే.. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’కి మించి రాజమౌళి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడా అనిపిస్తుంది. మరి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Massive Exclusive
Just guarenteed by sources close to #SSRajamouli that his next 3 movies will be trilogy with superstar #MaheshBabu starting from #SSMB29 30 and 31 , a massive star cast from Hollywood and india will join this franchise and looking to release over next 8 years pic.twitter.com/h0qxFkgNbA— Harminder 🍿🎬🏏 (@Harmindarboxoff) April 10, 2023