బుల్లితెరపై హోస్ట్ గా రాణించడం అంటే అంత సులభమైన విషయం కాదు. పైగా.., సినిమా హీరోలుగా మంచి క్రేజ్ ఉన్న వారు ఈ యాంగిల్ లో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం కాస్త కష్టమైన పనే. కానీ.., యంగ్ టైగర్ యన్టీఆర్ కి మాత్రం ఇదేమి పెద్ద కష్టం కాదు. తారక్ ఆల్ రౌండర్. షో ఏదైనా.. ఒక్కసారి ఆయన ఎంట్రీ ఇస్తే.. రేటింగ్స్ పరుగులు పెట్టాల్సిందే. ఇది జూనియర్ రేంజ్.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లోప్రసారం అవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి తారక్ హోస్ట్ గా చేస్తున్నారు. తనదైన వాక్చతుర్యంతో ఈ షోని జూనియర్ బాగానే రన్ చేస్తున్నాడు. అయితే.., ప్రేక్షకులకి అంతకు మించి కావాలి కదా.. అందుకే.. మరింత వినోదం కోసం టాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులను అతిథులుగా తీసుకొస్తున్నారు జూనియర్. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ ఈ షోకి గెస్ట్ లుగా విచ్చేసి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వంతు వచ్చింది.మహేశ్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ షూట్ ఈ ఆదివారం పూర్తయ్యింది. అయితే.., ఈ ఎపిసోడ్ ని ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఏదైనా స్పెషల్ డే కి.. ఈ స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు నాగ్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్-5 కి కూడా గెస్ట్ లు క్యూ కడుతుండటం విశేషం. ఏదేమైనా ఈ ఇద్దరూ స్టార్ హీరోలు బుల్లితెరపై హోస్ట్ లుగా చేస్తూ, సెలబ్రెటీలను స్మాల్ స్క్రీన్ పైకి తీసుకొస్తుండటం ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తోంది. మరి.. తారక్, మహేశ్ ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? ఈ ఇద్దరు స్టార్ హీరోల కలయికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.