తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా చెలామణి అవుతున్నవారిలో మహేష్ బాబు ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే చాలా ఎన్నో అంచనాలు పెరిగిపోతుంటాయి. సర్కారు వారి పాట తర్వాత చాలా గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అతికొద్దిమంది మాత్రమే మంచి సక్సెస్ బాటలో నడిచారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించి.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర దర్శకత్వంలో ‘రాజకుమారుడు’మూవీతో హీరోగా మారాడు. హీట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ముచ్చటగా మూడో సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ దర్శకుడు పరుశరామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’మంచి సక్సెస్ సాధించింది. ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు మహేష్ బాబు. గత ఏడాది మహేష్ బాబు ఇంట వరుస విషాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా మూవీస్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. తాజాగా మహేష్ బాబు కొత్త లుక్ లో దర్శనమిస్తున్నాడు.
సాధారణంగా ప్రతి మూవీలోనూ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుంటారు మహేష్ బాబు. సినిమాలోని క్యారెక్టర్ కి తగ్గట్టు ఫిట్ నెస్ కోసం ఎంతైనా కష్టపడుతుంటారు. ఇండస్ట్రీలో మహేష్ బాబు చాలా సాఫ్ట్ అంటారు.. ఎంలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లడు. ఎప్పుడూ తన ఫ్యామిలీ, ఫిట్ నెస్ కోసం జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తుంటారు. లేదంటే కుటుంబంతో వెకేషన్స్ కి వెళ్తుంటారు. తాజాగా ఆయన జిమ్ లో వర్కవుట్స్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహేష్ బాబు యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా మంచి ఫిట్ నెస్ తో ఉన్నారు. జిమ్ లో ఆయన వర్కవుట్స్ చూస్తుంటే మతి పోవాల్సిందే. ల్యాండ్‌మైన్ ప్రెస్, కెటిల్‌బెల్ స్వింగ్స్, ఒ స్కిల్‌మిల్ రన్ ఒక్కో నిమిషం చొప్పున పూర్తి చేశాను. మీరు ఎన్ని సెట్స్ చేయగలరు అంటూ ప్రశ్నిస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు మహేష్ యంగ్‌లుక్‌లో కనడటానికి రహస్యం ఇదేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.