బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ‘లాకప్’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షో ఆడియన్స్‌ను బాగానే అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఈ గేమ్‌లో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలంటే కంటెస్టెంట్స్ ఒక సీక్రెట్ చెప్పాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు బయటపెడుతున్న సీక్రెట్లు వింటుంటే ప్రేక్షకుల మతి పోతోంది. ఎలిమినేషన్ నుంచి గట్టెక్కడం కోసం ఇన్నాళ్లుగా దాచిపెట్టిన రహస్యాలను నిర్మొహమాటంగా బయటపెడుతున్నారు కంటెస్టెంట్లు. తాజాగా తెహ్‌సీన్ పూనావాలా ఓ షాకింగ్ రహస్యాన్ని వెల్లడించినప్పటికీ అతడు షో నుంచి ఎలిమినేట్ అవక తప్పలేదు.
ఇంతకీ అతడు బయటపెట్టిన సీక్రెట్ ఏంటో పూనావాలా మాటల్లోనే తెలుసుకుందాం.. ‘ఇండియాలోనే ఓ ప్రముఖ వ్యాపారవేత్త అతడి భార్యతో గడపాలని నాకో ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు శని, ఆదివారాల్లో మా ఇద్దరి కోసం నైట్ క్లబ్ కూడా బుక్ చేసేవాడు. అతడి భార్యతో బెడ్ షేర్ చేసుకుంటుండగా అతడు చూసి ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అదే జరిగింది కూడా! ఇప్పుడిది మీతో చెప్పడానికి కూడా నాకేం అభ్యంతరం అనిపించడం లేదు. ఎందుకంటే అందులో తప్పేం లేదు. అతడి కోరికను మేము నెరవేర్చాం. అంతే..’ అని చెప్పుకొచ్చాడు.ఇక ఈ సీక్రెట్ నీ భార్యకు తెలుసా ? అని కంగనా ప్రశ్నించగా.. తెలుసు.. పెళ్లికి ముందే తాము డేటింగ్‌లో ఉన్నప్పుడే ఈ విషయాన్ని ఆమెకు చెప్పానని పూనావాలా తెలిపాడు.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ హౌస్ లో ఆ పని చేసి అడ్డంగా దొరికిపోయిన యాంకర్ శివ!లాకప్ షోలోని మరో కంటెస్టెంట్ సైతం రహస్యాన్ని బయపెట్టాలనడంతో.. సాయేషా.. తాను పదేళ్ల వయసులోనే అత్యాచారానికి గురయ్యానని బాంబు పేల్చింది. మరో లాకప్ కంటెస్టెంట్, క్రికెటర్ శివమ్ శర్మ తన గురించి ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. తన తల్లి స్నేహితురాలితో బెడ్ షేర్ చేసుకున్నట్లు తెలిపాడు. ‘మా అమ్మ స్నేహితురాలు మా ఇంటికి దగ్గర్లోనే ఉండేది. ఆమె విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఆమెకు నేనంటే ఇష్టం. వైట్ సాస్ పాస్తా తీసుకుని ఆమె ఇంటికి వెళ్లేవాడిని. ఆమెతో పడక షేర్ చేసుకున్నాను. ఇది ఎనిమిదేళ్ల క్రితం అంటే నా కాలేజీ రోజుల్లో జరిగింది’ అని శివమ్ శర్మ చెప్పుకొచ్చాడు. అతడు చెప్పిన సీక్రెట్ విని మిగతా కంటెస్టెంట్లు షాకయ్యారు. దీన్ని యూజ్ చేసుకోవడం అంటారని ఓ కంటెస్టెంట్ అనడంతో స్పందించిన శివమ్ శర్మ.. అది ఇద్దరి ప్రమేయంతోనే జరిగిందని, ఆమెను తాను వాడుకోలేదని స్పష్టం చేశాడు.
We really Live in a society where cynical clones/shameless ppl like #ShivamSharma will do whatever they want, and no one is ready to take a stand against them. I have no words, I’m literally speechless right now. Someone pls stop him !! #LockUpp #LockUppWithKaran #SiddharthSharma pic.twitter.com/MPcDHYRQA0
— kevs.fp (@punegangsta_fp) March 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.