Rajinikanth: ఓ డైరెక్టర్ తాను అనుకున్న కథను యథావిథిగా ఓ సినిమాగా తెరకెక్కించటం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక్కోసారి అనుకున్న కథ ఒకటి.. సినిమా అవుట్‌పుట్ ఒకటి అవుతుంటాయి. అతి కొంతమంది స్టార్ డైరెక్టర్లు మాత్రమే తాము అనుకున్న కథను అనుకున్నట్లుగా సినిమాగా చేయగలుగుతున్నారు. స్టార్ హీరోలతో తమకు నచ్చినట్లుగా సినిమా తీయగలుగుతున్నారు. కానీ, చాలా మంది విషయంలో అలా జరగటం లేదు. కొంతమంది స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నపుడు.. కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి.
హీరోలు కథలో వేలుపెట్టి మార్పులు చెప్పటం వల్ల సినిమాలు ప్లాప్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఓ సినిమా విషయంలో ఇదే అనుభవాన్ని చవి చూశారు ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్. ఆయన దర్శకత్వం వహించిన ‘లింగా’ సినిమా క్లైమాక్స్ కథలో రజనీ వేలు పెట్టడం వల్లే సినిమా ప్లాప్ అయిందని చెప్పకనే చెప్పారు. కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. ‘‘ లింగా సినిమాకు మేము ముందు అనుకున్న క్లైమాక్స్ వేరు. అసలు బెలూనే లేదు. హైదరాబాద్‌లో షిప్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది.
నేను సాంగ్ షూటింగ్ జరుగుతున్న దగ్గర సీన్లు ఎడిట్ చేస్తూ ఉన్నాను. రజనీకాంత్‌కు బ్రేక్ రావటంతో నాదగ్గరికి వచ్చారు. ‘ఎడిటింగ్‌లో ఏం చేస్తున్నారో.. నేను చూడొచ్చా’ అన్నారు. అప్పుడు నేను ‘ సార్! లింగేశ్వరన్ క్యారెక్టర్ షూటింగ్ అయిపోయింది. అందులో చాలా ట్రిమ్ చేయాల్సి ఉంది’ అన్నాను. ఆయన వీడియో చూసి ‘ దయచేసి దీన్ని ట్రిమ్ చేయకండి’ అన్నారు. నేను ‘సార్! కథలో యంగ్ క్యారెక్టర్ కోసం లింగేశ్వరన్ క్యారెక్టర్ ఎడిట్ చేయాలి’ అన్నాను. ‘ అయ్యయ్యో! కథలో యంగ్ క్యారెక్టర్ హీరో కాదు.. లింగేశ్వరనే హీరో.. ఇప్పుడు బాగుంది.
ఎడిట్ చేయకండి’ అని ఎమోషనల్ అయ్యారు. నాకది నచ్చలేదు. నేను ఆలోచనల్లో పడ్డాను. నా అసిస్టెంట్లకు కూడా రజనీ చెప్పింది నచ్చలేదు. అయినా తప్పలేదు. నచ్చకపోయినా నేను ఆయన చెప్పింది చేశాను. పైగా రజనీ బర్త్‌డేకు సినిమా రిలీజ్ కావాలన్న ఒత్తిడి కూడా ఉండింది. క్లైమాక్స్ ఏదో చేసి పడేశాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి, లింగా సినిమా ప్లాప్ అవ్వటానికి రజనీకాంత్ కథలో వేలు పెట్టడమే కారణం అన్న కేఎస్ రవి కుమార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“லிங்கா படம் அவளோ மோசமா தோல்வி ஆனதுக்கு காரணம் ரஜினிகாந்த் தான். நா யோசிச்சு வச்ச கதையை மாத்திட்டாரு. எங்க யாருக்குமே அது புடிக்கல. அவர் தலையிட்டதுனால எல்லாமே மாத்தவேண்டியதா போச்சு”
– கே.எஸ்.ரவிக்குமார் #KSRavikumar #Lingaa #Rajinikanth pic.twitter.com/Ejylt5dDE2
— ıllıllı⭐🌟 𝐌𝐚𝐬𝐬 𝐌𝐚𝐡𝐚𝐫𝐚𝐣𝐚 🌟⭐ıllıllı (@Mass_Maharaja) July 19, 2022
ఇవి కూడా చదవండి : Immanuel: జబర్దస్త్ ఇమ్మానుయేల్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఫ్యాన్!