హీరోయిన్స్ సాధారణంగా షూటింగ్స్ లేకపోతే ఇంట్లో ఉంటారు లేదంటే వీలు చూసుకుని విదేశాలకు టూర్స్ వేస్తుంటారు. మాల్దీవులు, బాలీ.. ఇలా ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు ఎక్కడో ఓ చోటుకి వెళ్లి అక్కడ సేదా తీరుతుంటారు. ఈ క్రమంలోనే అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. నెటిజన్స్ కి ఆ ఫొటోలు నచ్చితే.. వావ్, సూపర్ లాంటి పదాలతో సదరు బ్యూటీలని పొగిడేస్తూ ఉంటారు. కానీ ‘లైగర్’ భామ అనన్య పాండే ఫొటోలు పోస్ట్ చేయగా, నెటిజన్స్ లైక్ కొట్టడానికి బదులు ట్రోల్ చేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేపై ట్రోలింగ్ ఎప్పటినుంచో ఉన్నదే. నటుడు చుంకీ పాండే కూతురు అయిన అనన్య.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేసినప్పటికీ ఈమెపై నెపో కిడ్ అని ముద్రపడిపోయింది. మూడేళ్లలో ఐదు సినిమాలు చేసింది గానీ ప్రశంసల కంటే ట్రోల్సే ఎక్కువగా వచ్చాయి, వస్తున్నాయి. ప్రతి సినిమా వచ్చిన సమయంలోనూ ఈమెపై నెటిజన్స్, ట్రోల్స్ తో విరుచుకుపడుతూనే ఉంటారు.
ఇక అనన్య పాండే విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ చేసింది. ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బొక్కబోర్లా పడింది. కనీస వసూళ్లు సాధించలేకపోయింది. చెప్పాలంటే దక్షిణాదిలో తనకు క్రేజ్ వచ్చేస్తుందని, ప్రమోషన్స్ లో పాల్గొనడంతో పాటు అనన్య తెలుగులోనూ మాట్లాడటానికి ప్రయత్నించింది. కానీ సినిమా రిజల్ట్ తేడా కొట్టేయడంతో పాటు ఈమె లుక్స్, నటనపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు వెకేషన్ లో ఉన్నట్లు కొన్ని ఫొటోలు పోస్ట్ చేయడంతో.. నెటిజన్స్ ఆమెని ఆడేసుకుంటున్నారు. లైగర్ డిజాస్టర్ అయినందుకు విహారయాత్రకు వెళ్లావా? సినిమా పోయిందనే బాధ లేదా అని అంటున్నారు. అనన్య పాండేపై వస్తున్న ట్రోల్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ రచ్చ రచ్చ!