గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకులు ప్రఫుల్లా కార్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. వృద్దాప్య కారణంగా ఆయన స్వగృహంలోనే తుది శ్వాస విడిచారని ఇంటి సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఆయనకు అకస్మాత్తుగా గుండెలో నొప్పి వచ్చిందని ఆ తర్వాత కాసేపటికే ఆయన మరణించారని పేర్కొన్నారు. కార్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పురిలోని స్వర్గ ద్వారా శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనలాతో కార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
1939 లో జన్మించిన ప్రపుల్లా తన సంగీతం.. గానంతో కోట్ల మంది ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకున్నాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీకి ఆయన అందించిన సేవలకు గాను 2015లో ప్రభుత్వం ప్రద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది. అలాగే జయదేవ అవార్డు కూడా వరించింది. ఆయన మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.