Salman Khan: ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో లారెన్స్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. సల్మాన్ ఖాన్ హత్య కోసం వేసిన ప్లాన్ గురించి పోలీసులకు వివరించాడు. గతంలో కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో రాజస్తాన్ హైకోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, సల్మాన్ ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేశాడు.
ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌ను చంపాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకు కారణం లేకపోలేదు. లారెన్స్ బిస్‌నోయ్ జాతికి చెందిన వాడు. ఈ జాతి వారికి కృష్ణ జింకలు దైవ సమానం. తమకు దైవ సమానమైన కృష్ణ జింకను చంపాడని లారెన్స్.. సల్మాన్‌పై పగ పెంచుకున్నాడు. సల్మాన్‌ను చంపటానికి తన అనుచరుడైన సంపత్ నెహ్రాను ముంబైకి పంపాడు. సంపత్.. సల్మాన్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించాడు.
ఆ టైంలో అతడి దగ్గర పిస్టల్ మాత్రమే ఉంది. దూరం నుంచి కాల్చే అవకాశం లేకపోయింది. దీంతో లారెన్స్ ఆర్కే స్ప్రింగ్ రైఫిల్‌ను ఆర్డర్ చేశాడు. అతడి అనుచరుడైన దినేష్ దగర్‌తో నాలుగు లక్షలు ఖర్చు పెట్టించి ఈ రైఫిల్‌ను తెప్పించాడు. ఈ డబ్బులు అనిల్ పాండే అనే వ్యక్తి చెల్లించాడు. అయితే, సంపత్ పథకం పారలేదు. సంపత్ అరెస్ట్ అయ్యాడు. సల్మాన్ ఖాన్ మర్డర్ ఫ్లాన్ విఫలమైంది.
ఆ తర్వాత లారెన్స్ గ్యాంగ్ ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను హతమార్చింది. ఆ కొద్దిరోజులకే సల్మాన్ ఖాన్ ఆయన తండ్రి సలీమ్ ఖానుకు బెదిరింపు లేఖ పంపింది. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను హతమార్చినట్టే సల్మాన్‌ను ఆయన తండ్రిని కూడా హతమారుస్తామని బెదిరించింది.
ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కు ముంబై పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సల్మాన్ కూడా అవసరం అయితే తప్ప బయటకు రావటం లేదు. మొన్న బక్రీద్ రోజు ఇంటి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం కూడా చేయలేదు. మరి, సల్మాన్ ఖాన్‌పై మర్డర్ ప్లాన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?