తెలుగు ప్రేక్షకులను పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఆమె.. తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ మధ్య సినిమాల కంటే రాజకీయ వివాదలలో నిలిచి వార్తల్లోకెక్కింది. ఆమె ఎవరో కాదు పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్.
తాజాగా ఈ పంజాబీ భామ ఓ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ‘నాతిచరామి’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ చేశారు మేకర్స్. అయితే.. ట్రైలర్ చూస్తే ఈసారి పూనమ్ కూడా గ్లామర్ తలుపులు తెరిచినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే.. ట్రైలర్ లోని బెడ్ సీన్స్ లో కూడా పూనమ్ రెచ్చిపోయి నటించి షాకిచ్చింది.
ఇక 1.29 నిడివి గల ఈ నాతిచరామి ట్రైలర్ లో బెడ్ రూమ్ సీన్స్ తో పూనమ్.. ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోందని చెప్పాలి. నాగు గవర దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుంది. మరి పూనమ్ చాలా రోజుల తర్వాత కనిపించిన ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.