Lakshmi Manchu: టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వేరు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో ఏదొక వార్తతో ట్రెండ్ అవుతుంటారు. అయితే.. మంచు ఫ్యామిలీ నుండి రెగ్యులర్ గా వార్తల్లో నిలిచేవారిలో మంచు లక్ష్మి, మంచు విష్ణు పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. తాజాగా ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా మరోసారి వార్తల్లోకెక్కింది లక్ష్మి. ప్రతి ఏడాదికి ఒకసారి వచ్చే యోగా డేని ప్రపంచవ్యాప్తంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారనే విషయం తెలిసిందే.
మనదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని.. రాజకీయనేతలు, ప్రముఖులు, సినీతారలు అందరూ యోగాలో పాల్గొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు మంచు లక్ష్మి కూడా యోగా డే సందర్భంగా తాను యోగా చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే.. మంచు లక్ష్మికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుసు కదా.. ఫ్యాన్స్ లైక్ కొట్టి వైరల్ చేస్తుండగా.. ట్రోలర్స్ పాత ఫొటోలే పెట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మంచు లక్ష్మి ఫిట్నెస్ కి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు వర్కౌట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి అప్డేట్స్ ఇస్తుంటుంది. అయితే.. యోగా డే సందర్భంగా సినీతారలంతా యోగా ఆసనాలు చేసిన పిక్స్ షేర్ చేస్తున్నారు. అలాగే మంచు లక్ష్మి కూడా పలు ఆసనాలు వేసిన పిక్స్ పోస్ట్ చేయడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక లక్ష్మి కెరీర్ పరంగా.. లేచింది మహిళా లోకం అనే సినిమా చేస్తున్నట్లు సమాచారం. మరి మంచు లక్ష్మి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.