చిత్రపరిశ్రమను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ప్రముఖుల మరణ వార్తలను మరువకముందే ఒక్కొక్కరుగా సీనియర్ యాక్టర్స్ దూరం అవ్వడం అనేది ప్రేక్షకులను కంగారు పెడుతోంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు జావేద్ ఖాన్ అమ్రోహీ కన్నుమూశారు.
చిత్రపరిశ్రమను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. రీసెంట్ గా ప్రముఖుల మరణ వార్తలను మరువకముందే ఒక్కొక్కరుగా సీనియర్ యాక్టర్స్ దూరం అవ్వడం అనేది ప్రేక్షకులను కంగారు పెడుతోంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు జావేద్ ఖాన్ అమ్రోహీ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 50 ఏళ్ళు. కాగా.. కొంతకాలంగా ఆయన శ్వాససంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇటీవలే జావేద్ ఆరోగ్య పరిస్థితి బాగోలేక ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. దురదృష్టవశాత్తు అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు.
ఈ క్రమంలో జావేద్ ఖాన్ ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. ఇక వైవిధ్యమైన నటుడిగా గొప్ప పేరు గడించిన జావేద్ ఖాన్ మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. జావేద్ మృతి గురించి తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు అందరూ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం తెలియజేశారు. ముంబైలో పుట్టిన జావేద్.. 1973 నుండి ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు. కెరీర్ లో దాదాపు 150కి పైగా సినిమాలలో నటించిన ఆయన.. లగాన్, ఆషికీ, భాగీ, సడక్, అందాజ్ అప్నా అప్నా, కూలీ నెం.1, హలో బ్రదర్, షాదీ నెంబర్ వన్, ఉమ్రాన్ జావ్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా, చక్ దే ఇండియా, సడక్ 2, ఇష్క్ లాంటి సూపర్ హిట్ సినిమాలలో తనదైన ముద్రవేశారు. అలాగే సినిమాలే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకుల దగ్గరయ్యారు. ఈయన చివరిగా సడక్ 2లో నటించారు. ఇక బుధవారం (ఫిబ్రవరి 15) ఓషివారా స్మశానవాటికలో జావేద్ అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం.
Gutted to hear about #JavedKhanAmrohi Bhai’s demise. This seems to be a season of farewell. 💔💐
Condolences to his family, friends, colleagues @iptamumbai 🙏🏽#Nukkadd #Lagaan, and so on and so forth. pic.twitter.com/FpV17XMRO8
— Danish Husain । دانش حُسین । दानिश हुसैन (@DanHusain) February 14, 2023
Javed Khan Amrohi !! RIP 🙏 pic.twitter.com/Rovpo56QvP
— DeepPoint (@imDeepPoint) February 14, 2023