సాధారణంగా సినిమాలను ఆదరించాలంటే తెలుగు ప్రేక్షకుల తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. సినిమాలో కంటెంట్ ఉంటే ఏ అనువాద చిత్రాన్నైనా, ఏ హీరో సినిమానైనా ఆదరిస్తారు తెలుగువారు. ఇటీవలే మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందాన ప్రధాన పాత్రలలో నటించిన ‘సీతారామం’ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా విజయంతో చిత్రబృందం సక్సెస్ మీట్స్ లో పాల్గొంటుంది.
ఈ క్రమంలో ప్రత్యేకంగా దుల్కర్ సల్మాన్ లేడీ ఫ్యాన్స్ కోసం సపరేట్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా చేసిన స్ట్రయిట్ మూవీ ఇదే అయినప్పటికీ.. ఇదివరకే తనకు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే.. తాజాగా ఏర్పాటు చేసిన లేడీ ఫ్యాన్స్ మీట్ లో చాలామంది అమ్మాయిలు పాల్గొన్నారు. దుల్కర్ ఎంట్రీతో అందరూ తమ ఎక్సయిట్ మెంట్ ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఇక దుల్కర్ ని చూసి ఓ అభిమాని ఏకంగా అరుపులు కేకలతో పాటు ఎమోషనల్ అయిపోయింది.
సీతారామం మూవీ ‘రామ్’ క్యారెక్టర్ లో జీవించేశాడు దుల్కర్. అలాగే తన నటనతో థియేటర్లలో అందరినీ ఏడిపించేశాడు. ఇక ఈ తాజా మీట్ లో అమ్మాయి దుల్కర్ ని దగ్గరనుండి చూసి కేకలు వేసింది. ఆ తర్వాత దుల్కర్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఎమోషనల్ అయిపోయింది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎమోషనల్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మిగతా అమ్మాయిలు కూడా సర్ప్రైజ్ అయ్యారు. మరి ఈ లేడీ ఫ్యాన్ ఎక్సయిట్ మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.