రీసెంట్ గానే ఓ ఈవెంట్ లో ఆర్.నారాయణమూర్తి యాంకర్ పై సీరియస్ అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ కూడా తన కంటిసైగలతో యాంకర్ ని సైలెంట్ చేసేశారు.
సినిమాలు, రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ మంత్రి కేటీఆర్.. అటు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇటు హీరోలు, నిర్మాతలతో మంచి సంబంధాలు మెంటైన్ చేస్తూ ఉంటారు. చిన్నాపెద్దా చిత్రం అనే తేడా లేకుండా పలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోనూ పాల్గొని తన సపోర్ట్ అందజేస్తుంటారు. తాజాగా ‘బలగం’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న కేటీఆర్.. యాంకర్ విషయంలో చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘జబర్దస్త్’ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు దర్శకుడిగా మారాడు. అతడు తీసిన తొలి మూవీ ‘బలగం’. ప్రియదర్శి, కావ్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో తీశారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ మూవీని నిర్మించారు. మార్చి 3న థియేటర్లలో రిలీజ్ చేయడానికి సిద్ధమై, తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించగా చాలామంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.
అయితే ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ స్టేజీపై వెళ్లి మాట్లాడుదాం అనుకునే టైంలో ఈవెంట్ కు ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు వచ్చాడు. దీంతో అనుదీప్ స్పీచ్ మధ్యలోనే ఆపించేసి, అతడి చేతిలో ఉన్న మైక్ తీసుకున్న యాంకర్.. సిద్ధుకు స్వాగతం పలికింది. ఇది గమనించిన కేటీఆర్.. అనుదీప్ కు మైక్ ఇవ్వాలన్నట్లుగా యాంకర్ కు సైగ చేశారు. దీంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన ఆమె.. అనుదీప్ కు వెంటనే మైక్ ఇచ్చేసి పక్కకు వెళ్లిపోయింది. మరి కేటీఆర్ సైగలతో యాంకర్ సైలెంట్ కావడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.