టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగారు కృష్ణభగవాన్. ఆయన స్లాంగ్‌కు, వేసే పంచులకు వీరాభిమానులున్నారంటే అతిశయోక్తికాదు. కొన్నేళ్ల క్రితం వరకు కూడా వరుసగా సినిమాలు చేసిన కృష్ణ భగవాన్.. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత తాజాగా ఈటీవీలో ప్రసారం అవుతున్న జాతి రత్నాలు స్టాండప్ కామెడీ షోలో కనిపించారు. అక్కడ కృష్ణ భగవాన్ చేసిన కామెడీ, పేల్చిన పంచ్‌లు మాములుగా లేవు. ఆయనలో కామెడీ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ అయ్యింది.
ఇది కూడా చదవండి: యాంకర్ సుమను ఏడిపించిన హీరో నాని, అసలేం జరిగింది
ఆ తర్వాత కృష్ణ భగవాన్ మరోసారి బుల్లితెర మీద కనిపించారు. సుమ నిర్వహించే క్యాష్ కార్యక్రామానికి హాజరయ్యారు. పోసాని కృష్ణమురళీ, హేమ, సమీర్, కృష్ణ భగవాన్ ఇలా అందరూ కలిసి సుమ క్యాష్ షోకు గెస్టులుగా వచ్చారు. మిగతా ముగ్గురు ఇప్పటికే క్యాష్ షోకి పలుమార్లు హాజరు కాగా.. కృష్ణ భగవాన్ మాత్రం క్యాష్ షోకి రావడం ఇదే మొదటి సారి.
ఇది కూడా చదవండి: SRH హ్యాట్రిక్ విక్టరీ! నవ్వులు చిందించిన కావ్య పాపఇక షోలో కృష్ణభగవాన్ పంచులకు స్టేజ్ దద్దరిల్లింది అని చెప్పవచ్చు. ఇక షోలో భాగంగా సుమ.. కృష్ణభగవాన్‌ని ఉద్దేశించి.. మీరు మీ లైఫ్‌లో చాలా ఆశ్చర్యానికి గురైన సందర్భాలున్నాయా? అని సుమ అడిగింది. రఘుబాబు, ఇంకో ఆవిడకు నంది అవార్డు రావడం అని కృష్ణ భగవాన్ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత సుమ.. ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరైనా తొక్కేయాలని చూశారా? అని మరో ప్రశ్నను వేసింది. రఘుబాబే అని కృష్ణ భగవాన్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ఎవరైనా ఒకరిని తుక్కు తుక్కు కొట్టమంటే ఎవరిని కొడతారు అని ఇంకో ప్రశ్న అడుగుతుంది సుమ. దీనికి కృష్ణ భగవాన్ ఆన్సర్ చెప్పేలోపే సమీర్ అందుకుని.. ఇంకెవరు రఘుబాబే అని కౌంటర్ వేస్తాడు. అలా మొత్తానికి ఆ రౌండ్ అంతా నవ్వులతో నిండిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరలవుతోంది. కృష్ణ భగవాన్ కామెడీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ మంచి మనసు.. కాన్వాయ్ ఆపి మరీ…