కన్నడ ప్రముఖ నిర్మాత జాక్ మంజునాథ ఆరోగ్యం విషమంగా ఉందంటూ గత కొన్ని రోజుల నుంచి కన్నడ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సైతం ఆస్పత్రి సిబ్బంది లీక్ చేయడంతో నిజమేనని ఆయన అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. జాక్ మంజునాథ పూర్తిగా కోలుకోవాలంటూ అభిమానులు, బంధువులు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. ట్విట్టర్ లో స్పందించిన ఆయన.. జాక్ మంజునాథ ఆరోగ్యంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Sai Pallavi: సాయి పల్లవికి సారె పెట్టి సత్కరించిన దర్శకుడు.. ఫోటోలు వైరల్!
“మై డియర్ ఫ్రెండ్స్, అండ్ బ్రదర్స్.. జాక్ మంజునాథ్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు. ఈ రోజు మంజునాథ్ డిశ్చార్జీ. ముందస్తు జాగ్రత్తగా చెకప్ కోసం ఇటీవల ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే ఆసుపత్రి సిబ్బంది బెడ్ పై ఆయన నిద్రపోతున్న ఫొటోలను లీక్ చేశారు. దీంతో అభిమానులు, స్నేహితులు, బంధువులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మంజునాథ్ ఆరోగ్యం నిలకడగనే ఉంది. ఎవరూ ఖంగారు పడాల్సిన అవరసరం లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు కృతజ్ఞతలు” అంటూ సుదీప్ ట్విట్టర్ లో తెలిపాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో జాక్ మంజునాథ నిర్మాతగా వ్యవహరించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను సైతం నిర్మించారు. నిర్మాత జాక్ మంజునాథ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
My dear brother and friend @JackManjunath is fine and getting discharged today. He was admitted on precautionary grounds and nothing serious. Few leaked pics taken by staff while he was sleeping is doing rounds making it look serious.
Thanks to all fo ua wshs and prayers.🙏🏼— Kichcha Sudeepa (@KicchaSudeep) June 14, 2022