KGF: ప్రస్తుత దేశవ్యాప్త హాట్ టాపిక్ ‘‘కేజీఎఫ్-2’’ సినిమా. ఈ సినిమా రెండు రోజుల్లోనే 300 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది. హిందీలో లోకల్ సినిమాలను మించి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఇంత హిట్ అవ్వటానికి అన్నిటితో పాటు బ్యాక్రౌండ్ మ్యూజిక్ ఓ ప్రధాన అంశం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ మ్యూజిక్ లోకపోతే సినిమాను ఊహించుకోలేం. సినిమా చూసిన వాళ్లంతా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. గూస్‌బంప్స్ మ్యూజిక్ అంటూ పేరు కూడా పెట్టేశారు. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరక్టర్ పేరు ‘రవి బస్రూర్’. 2014లో వచ్చిన ఉగ్రమ్ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ‘‘ఉగ్రమ్’’ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా.
ప్రశాంత్ తీసిన మూడు సినిమాలకు ఈయనే మ్యూజిక్ డైరక్టర్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ – ప్రభాస్ సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ ఇస్తున్నారు. రవి ఖాతాలో పెద్ద పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. ఎంత స్టార్‌డమ్ వచ్చినా ఒదిగుండాలనే మనస్తత్వం ఆయనది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. 2020 కరోనా టైంలో చోటుచేసుకున్న సంఘటనలు. 2020 మార్చి నెలలో కరోనా విపరీతంగా పెరిగేసరికి ప్రభుత్వం కర్ణాటక వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. దీంతో సాధారణ ప్రజలు తినడానికి కూడా అవస్తపడే పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో సొంత ఊర్లో ఉన్న రవి తండ్రికి సహాయం చేయాలనుకున్నాడు.
Kgf music director “#Ravibasrur‘ Turned blacksmith during covid Lockdown to Help his father earn rs.35
He came to limelight with #KGFChpater1 in 2018 & recently, in #KGF2 also, He has delivered goosebumps music. pic.twitter.com/CpAnHcgsVA
— Thyview (@Thyview) April 17, 2022
కుమారుడు పెద్ద మ్యూజిక్ డైరక్టర్ అయినప్పటికి తండ్రి మాత్రం బ్లాక్ స్మిత్( కొలిమి పనులు చేసే వ్యక్తి)గా కొనసాగుతూనే ఉన్నాడు. రూ.35 సంపాదించటానికి చాలా కష్టపడేవాడు. ఆ కష్టాన్ని చూడలేక రవి రంగంలోకి దిగాడు. స్వయంగా కొలిమి పనులు చేశాడు. అదే కాకుండా తన చేత్తో వెండి ఆభరణాలను చెక్కాడు. తండ్రికి సహాయంగా నిలిచాడు. ‘‘ నా గత జ్ఞాపకాలను గుర్తు చేసిన దేవుడికి ధన్యవాదాలు. ఆయన సూత్రదారి మనం పాత్రదారులం’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. అప్పట్లో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. రవి సింప్లిసిటీకి అందరూ ఫిదా అయ్యారు. మరి, రవి సింప్లిసిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మూడోరోజూ బాక్సాఫీస్ పై రాఖీ దండయాత్ర.. కలెక్షన్స్ సునామీ!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.