గాడ్ ఫాదర్- మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ రెండు పేర్లు మారుమ్రోగుతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత మెగా ఫ్యాన్స్ ఈ మాస్ ఫీస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. చిరంజీవి కూడా ఈ సినిమా సక్సెస్‌ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌కి మెగాస్టార్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేయశారు. సల్లూ భాయ్ ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించిన విషయం తెలిసిందే. అయితే సల్మాన్ బర్త్ డేకి ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చేందుకు రామ్‌చరణ్ రెడీ అయ్యాడంట. ఆ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన పూరీకి కూడా చిరంజీవి సినిమా ఆఫర్ ఇచ్చారు. మంచి కథతో మిమ్మల్ని కలుస్తానంటూ పూరీ కూడా మాటిచ్చాడు.
ఈ సినిమా సక్సెస్, కలెక్షన్స్, నటీనటుల గురించి పక్కన పెడితే ఇప్పుడు మరో విషయం గురించి బాగా చర్చ జరుగుతోంది. అదేంటంటే KCPD.. అవును గతంలో ఓసారి ఈ పదం బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ పదం నెట్టింట ట్రెండ్ అవుతోంది. గాడ్ ఫాదర్ సినిమాలో ఈ పదం మీద ఓ సీన్ కూడా ఉంది. అంతేకాకుండా కేసీపీడీ అంటూ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా వచ్చింది. గతంలో దీనికి ఏదైనా అర్థం ఉండచ్చుగాక.. కానీ, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ దానికి ఒక కొత్త డెఫినేషన్ తీసుకొచ్చారు. KCPD అంటే ‘కొణిదెల చిరంజీవి ప్యూర్ డామినేషన్’ అంటూ మెగా ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. గాడ్‌ఫాదర్ సినిమాలో మెగాస్టార్ స్వాగ్, యాక్టింగ్, డాన్స్, లుక్స్ అన్నీ కలిపి ‘KCPD’ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇంక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. యంగ్ హీరోల కంటే ఎంతో దూకుడుగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. బాబీ డైరెక్షన్లో చిరు 154వ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అని పేరు పెడతారని ఎప్పటి నుంచో వైరల్ అవుతోంది. పైగా ఆ పోస్టర్లో చిరు ఎంతో మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. అలా చూసుకున్నా టైటిల్ అదే అవుతుందని చెబుతున్నారు. ఇంక మెహర్ రమేశ్ దర్శవకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎంతో స్టైల్‌గా, యంగ్ లుక్స్ లో అలరించనున్నారు. ఇంక పూరీ మంచి కథతో వస్తే వచ్చే ఏడాదే ఆ సినిమాని కూడా పట్టాలు ఎక్కిచ్చేస్తారు అని టాక్ స్టార్ట్ అయ్యింది. మొత్తానికి కుర్ర హీరోల కంటే మెగాస్టార్ ఈ స్థాయిలో దూసుకుపోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంక కేసీపీడీ కొత్త డెఫినేషన్ని షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.