కొంతమంది సెలబ్రిటీలు వారి లగ్జరీనెస్ ని కార్లు, బంగ్లాలు చూపించి ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొందరు ఎంత సంపాదించినా సైలెంట్ గా కానిచ్చేస్తుంటారు. టైం బాలేనప్పుడు సెలబ్రిటీలే కాదు.. సెలబ్రిటీల డ్రైవర్స్ చేసిన పనికి కూడా బద్నామ్ కావాల్సి ఉంటుంది. తాజాగా ఓ యంగ్ బాలీవుడ్ హీరో విషయంలో అదే జరిగింది.
సాధారణంగా సెలబ్రిటీలు రిచ్ పోసిషన్ లో ఉంటారు.. కాబట్టి, వారు లగ్జరీ కార్లు, లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తుంటారని మనకు తెలుసు. కొన్నిసార్లు కొంతమంది సెలబ్రిటీలు వారి లగ్జరీనెస్ ని కార్లు, బంగ్లాలు చూపించి ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొందరు ఎంత సంపాదించినా సైలెంట్ గా కానిచ్చేస్తుంటారు. అయితే.. సైలెంట్ గా ఉన్నవాళ్ళ సంగతి ఓకే. వివాదాలలో ఇరుక్కునే ఛాన్సులు తక్కువ. అదే బిల్డప్ లకు పోయేవారు ఏదొక విధంగా వివాదాలలో, వార్తల్లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. అయితే.. టైం బాలేనప్పుడు సెలబ్రిటీలే కాదు.. సెలబ్రిటీల డ్రైవర్స్ చేసిన పనికి కూడా బద్నామ్ కావాల్సి ఉంటుంది.
తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ డ్రైవర్ చేసిన పనికి.. కార్తీక్ కారుకు ఫైన్ వేశారు ముంబై పోలీసులు. పైగా కారు నడిపింది కార్తీక్ కాదు.. కారులో కార్తీక్ కూడా లేడు.. అయినా ముంబై ట్రాఫిక్ పోలీసులు కార్తీక్ కారుకు ఫైన్ వేసిన చలానాని, ఫైన్ వేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. అదీగాక కార్తీక్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ.. షెహజాదాలోని డైలాగ్ ని మెన్షన్ చేస్తూ ట్వీట్ చేసి సర్ప్రైజ్ చేశారు పోలీసులు. ఇంతదాకా చదివాక.. ఖచ్చితంగా అసలు మ్యాటర్ లోకి తీసుకెళ్లట్లేదు ఏంటి? ఇంతకీ కార్తీక్ కి ఫైన్ ఎందుకు పడింది? అక్కడ జరిగిన సంఘటన ఏంటనే విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి వచ్చే ఉంటుంది.
అసలు వివరాల్లోకి వెళ్తే.. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు కార్తీక్ ఆర్యన్ డ్రైవర్.. ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్ బయట కారును పార్క్ చేశాడట. అయితే.. కారును రాంగ్ సైడ్ లో పార్కింగ్ చేశాడని.. కారుకు ఫైన్ వేశారు పోలీసులు. కారుని రాంగ్ సైడ్ పార్కింగ్ చేసిన ఫోటోతో పాటు చలానా విధించిన వీడియోని కూడా పోలీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేగాక.. ‘కారు రాంగ్ సైడ్ లో పార్క్ చేసి ఉంది. అంతమాత్రాన షెహజాదా ట్రాఫిక్ రూల్స్ ని మీరుతాడని భావించవద్దు’ అని డైలాగ్ కూడా మెన్షన్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా కార్తీక్ నటించిన షెహజాదా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో మూవీకి రీమేక్ ఇది. ప్రస్తుతం సినిమా థియేటర్స్ లో రన్ అవుతోంది. మరోవైపు ఈ యంగ్ హీరో.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి కార్తీక్ కారుకి ఫైన్ వేసి.. ట్విట్టర్ లో పోస్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Problem? Problem yeh thi ki the car was parked on the wrong side!
Don’t do the ‘Bhool’ of thinking that ‘Shehzadaas’ can flout traffic rules. #RulesAajKalAndForever pic.twitter.com/zrokch9rHl— Mumbai Traffic Police (@MTPHereToHelp) February 18, 2023