స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క అలియాస్ దీపకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్. వంటలక్క పాత్రలో పూర్తిగా జీవించేసింది ప్రేమి విశ్వనాథ్. అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ప్రేమి. అయితే త్వరలోనే ఆమె తెలుగు ప్రేక్షకులకు దూరం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రేమి తెలుగులో చేస్తోన్న ఒకే ఒక సీరియల్ కార్తీక దీపం. ఏళ్లుగా ఈ సీరియల్ ప్రసారం అవుతోంది.
డాక్టర్ బాబు-వంటలక్కల ప్రేమ పెళ్లితో ప్రారంభమైన సీరియల్.. వంటలక్క గర్భవతిగా ఉన్న సమయంలో వారిద్దరు విడిపోవడం, పిల్లలు పెరిగి పెద్దవారవ్వడం.. తిరిగి కలుసుకోవడం.. మళ్లీ లేడి విలన్ రూపంలో కష్టాలు రావడం వంటి భాగాలతో సాగుతున్న సీరియల్ లో దర్శకుడు ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చాడు. సీరియల్ లో ప్రధాన పాత్రలైన డాక్టర్ బాబు, వంటలక్క, మరో క్యారెక్టర్ చనిపోయినట్లు చూపించాడు.
మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ రేపటి ప్రోమోలో మాత్రం డాక్టర్ బాబు, వంటలక్క ఫోటోకి దండేసి ఉన్న సీన్ చూపించాడు. నిజంగా సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క మరణిస్తే కార్తీక దీపం సీరియల్ ఆగిపోయే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఈ ట్విస్ట్ తో సీరియల్ ఎలాంటి మలుపు తిరగనుంది.. ఈ క్యారెక్టర్లు నిజంగానే చనిపోయారా.. లేక తిరిగి సీరియల్ లో కనిపిస్తారా అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.