సీనియర్ ఎన్టీఆర్ ఎవరికి దైవం. ఎందుకు ఆయన్ని దైవం చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. నాకు కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.
ఖమ్మంలో త్వరలో ఓ భారీ సినీయర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. శ్రీకృష్ణుడి రూపంలో ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. హిందువులకు దైవమైన శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని ప్రముఖ తెలుగు నటి కరాటే కళ్యాణి తప్పుబడుతున్నారు. దేవుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విగ్రహ ఏర్పాటుపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా విగ్రహ ఏర్పాటుపై ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ..
‘‘ సీనియర్ ఎన్టీఆర్ దైవం అంటున్నారు. దైవం.. ఓకే. ఎవరికి దైవం.. ఏ వర్గానికి దైవం. ఎవరికోసం ఆయన్ని దైవాన్ని చేస్తున్నారు. ఎవరిని మెప్పించటానికి చేస్తున్నారు. దైవానికి, మానవుని తేడా ఉందా లేదా. మానవుడు దేవుడైతే..మనం దేవుళ్ల గురించి మాట్లాడుకోవడం ఎందుకు?. మనుషుల్ని ఏ వర్గానికి దేవుళ్లను చేయకండి. ఒక వేళ మనుషుల్ని దేవుళ్లను చేస్తే.. ఎన్టీఆర్ ఏ కులానికి దేవుడు.. ఏ వర్గానికి దేవుడు. ఎందుకు దేవుడిగా ఆపాదిస్తున్నారు. మీ మనోభావాలు దెబ్బతిన్నట్లే.. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందువులందరి మనో భావాలు దెబ్బతిన్నాయి. ఎందుకు ఎన్టీఆర్ అభిమానులను ఇందులోకి లాగుతున్నారు.
ఎన్టీఆర్ అభిమానులు వాళ్లు చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి.. నీకు ఏదో అయిందంట కదా.. ఏదో వచ్చిందట కదా.. ఆస్పత్రిలో ఉన్నావట కదా.. ఎన్టీఆర్ విగ్రహం ఆపుతున్నావట కదా.. నీకేదో రోగం ఉందట కదా.. అని ఫోన్ చేశారు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.