సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ మద్య యూట్యూబర్ శ్రీకాంత్ తో జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంతే కాదు మీడియా వేధికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ వివాదం కొనసాగుతూ ఉన్న సమయంలో ఆమె ఇంటిని చైల్డ్ లైన్ అధికారులు పోలీసులు తనిఖీలు చేశారు. కరాటే కళ్యాణి ఎలాంటి అనుమతి లేకుండా చిన్న పిల్లలను తన ఇంటిలో ఉంచిందన్న ఫిర్యాదు తో చైల్డ్ లైన్ అధికారులు పోలీసులు సోదాలు నిర్వహించారు
ఈ విషయం మీడియాకు తెలియడంతో నానా రచ్చ జరిగింది. అంతేకాదు కరాటే కళ్యాణి కనిపించకుండా పోయిందని తెగ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. తాను ఎక్కడికీ పోలేదని.. తనపై వస్తున్న ఆరోపణలు అసత్యం అని నిరూపించడానికి పాప తల్లిదండ్రులను తీసుకు రావడానికి వేళ్లినట్లు తెలిపింది. అంతేకాదు తనను బదనామ్ చేయడానికి కొంతమంది పన్నుతున్న కుట్ర అన్నారు. తనకు పిల్లలు లేరని కల్యాణి పేర్కొన్నారు. తాను ఎవరినీ దత్తత తీసుకోలేదని కల్యాణి పేర్కొన్నారు.
తనకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమని తెలిపింది. తాను ఎవరినీ బయపెట్టి.. బలవంతంగా కిడ్నాప్ చేయలేదు.. పాపను కొంత కాలం తన వద్ద ఉంచి తర్వాత దత్త తీసుకుందామని అనుకుంటున్నాని తెలిపింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులను కల్యాణి మీడియాకు చూపించారు. తమకు పెద్దగా సంపాదన లేదని.. పిల్లను పోషించలేక కల్యాణి దగ్గర ఉంచినట్లు పాప తల్లిదండ్రులు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే ఉన్నానని.. ఎక్కడికీ పారిపోను అని కరాటే కళ్యాణి తెలిపింది.