చిత్ర పరిశ్రమలో వారానికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రామే ప్రేక్షకుల మనసు దొచుకుంటాయి. ఈ మధ్య కాలంలో అలా చిన్న చిత్రంగా విడుదలై అఖండ విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. కన్నడంలో చిన్న చిత్రంగా విడుదలైన కాంతార.. తెలుగులో డబ్బింగ్ చిత్రంగా విడుదలైనప్పటికీ ఓ తెలుగు చిత్రం కంటే ఎక్కువగా విజయం సాధించింది. అది ఎంతలా అంటే కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను కొల్లగొట్టేంతగా. ఈ నేపథ్యంలో కాంతార మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తీపి కబురు చెప్పింది టీమ్. ప్రముఖ ఓటీటీలో త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
‘కాంతార’ గత కొన్ని రోజులుగా కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాక యావత్ దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతార’. భూతకోల నృత్యం ప్రధాన అంశంగా, అక్కడి సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన కాంతార ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి.. చిత్ర యూనిట్ ను ప్రశంసించారు. దాంతో ఈ మూవీని థియేటర్లలో చూడ్డం మిస్ అయిన వారు.. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఓ వైపు రికార్డుల మీద రికార్డులను కొల్లగొడుతోంది కాంతార. ఇప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఈ చిత్రం. దాంతో భారీ ధరకు డిజిటల్ ప్రీమియర్ హక్కులను కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. నవంబర్ 24 గురువారం నుంచి ‘కాంతార’ స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ వెల్లడించింది.
#KANTARA pic.twitter.com/kfL2zWiCRM
— Aakashavaani (@TheAakashavaani) November 17, 2022