గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ లు వరుసగా కన్నుమూస్తున్నారు. ప్రముఖ కన్నడ టీవి నటి చేతనా రాజ్ కన్నుమూసింది. ఆమె మృతికి కారణం కాస్మోటిక్ సర్జరీ అంటున్నారు. ఈ మద్య పలువురు నటీ, నటులు కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చేతనా రాజ్ కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవడం.. అది కాస్త వికటించడంతో ఆమె మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. వివరాల్లోకి వెళితే..
కన్నడ ఇండస్ట్రీలో చేతనా రాజ్ పలు టీవి షోస్, సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బెంగళూరులోని డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్‌లో ప్లాస్టీక్ సర్జరీ చేయించుకుంది. ఇటీవల తన బరువు పెరిగిపోతుందని.. స్లిమ్ గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో డాక్టర్ ని అశ్రయించినట్టు తెలుస్తోంది. కానీ ఆదే ఆమె జీవితానికి చరమగీతం పాడుతుందని ఊహించలేదు.. చేతనా రాజ్ లివర్ లో నీరు చేరడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు.
ఇదిలా ఉంటే.. కాస్మొటిక్ హాస్పిటల్‌లో ఐసీయూ లేకపోవడం వల్లనే ఈ దారుణం జరిగిందని.. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేయడంతో ప్రాణహాని జరిగిందని అన్నారు. ఆపరేషన్ చేయించుకునే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని.. తన స్నేహితులతో కలిసి హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. కాగా, తమ కూతురు మరణానికి కాస్మొటిక్ సర్జరీ చేసిన ఆ వైద్యుడితే తప్పని పోలీసులకు ఫిర్యాదు చేశారు చేతనా రాజ్ తల్లిదండ్రులు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిన్నవయసులోనే తనువు చాలించిన నటికి కన్నడ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేశాయి.