Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అంటే ప్రత్యేక అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా కంగనా.. మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. బీజేపీకి కూడా బహిరంగంగా మద్దతు ఇస్తూ ఉంటారు. శనివారం నరేంద్ర మోదీ 72వ పుట్టిన రోజు సందర్భంగా కంగనా రనౌత్ స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. చిన్నతనంలో రైల్వే స్టేషన్‌లో టీ అమ్ముకునే స్థాయినుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన వ్యక్తిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఓ అద్భుతం. మీరు చిరకాలం ఇలాగే ఉండాలి.
రాముడు, కృష్ణుడు, గాంధీల్లాగా మీరు కూడా అమరులు. జాతిని ఉద్దరించటంలో మీరు ఇలానే కొనసాగాలి. మీ లెగసీని ఎవ్వరూ చెరపలేరు. అందుకే మిమ్మల్ని ఓ అవతార పురుషుడు అనేది. మీరు మా నాయకుడిగా ఉండటం మా అదృష్టం’’ అని అన్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ.. ‘‘ నేను మోదీకి పెద్ద ఫ్యాన్‌ను. ఎందుకంటే ఆయన సక్సెస్ స్టోరీ అలాంటిది. ఓ యువతిగా మనకు ఓ గొప్ప వ్యక్తి రోల్ మోడల్‌గా ఉండటం అవసరం. చాయ్ వాలా ప్రధానిగా మారటం అంటే మామూలు విషయమా.. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను..
ఇది ఆయన విజయం కాదు.. ప్రజాస్వామ్యం సాధించిన విజయం. అందుకే నేను ఆయనే సరైన రోల్ మోడల్ అని నమ్ముతున్నాను’’ అని చెప్పకొచ్చారు. కాగా, కంగనా ప్రస్తుతం దివంగత మహిళా ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్ ‘‘ ఎమర్జెన్సీ’’లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. కంగనా ‘‘ ఎమర్జెన్సీ’’ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజున ఆయన్ని అవతార పురుషుడంటూ పొగడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Saradhi: అంచనాలు పెంచుతున్న సారథి మూవీ! తారకరత్న కెరీర్‌లో బెస్ట్ మూవీ కానుందా?