Saradhi: కరోనా తరువాత బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ ని బట్టే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇలా.. క్రైసిస్ లో సక్సెస్ అయిన చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. “బింబిసార, కార్తికేయ-2” వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. అయితే.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అంతే స్థాయి మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి సిద్ధంగా ఉన్న సినిమా ‘సారథి’. నందమూరి తారకరత్న” హీరోగా నటించిన ఈ సినిమాని “పంచభూత క్రియేషన్స్” బ్యానర్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ “జాకట రమేశ్” తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి స్పందన లభించడంతో.. నందమూరి అభిమానులతో పాటు, మూవీ యూనిట్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు.
చిన్న సినిమా అయినప్పటికీ ఈ మూవీ అవుట్ పుట్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం దర్శకుడు “జాకట రమేశ్” కష్టంతో పాటు.. నిర్మాతలైన “నరేశ్ యాదవ్, కృష్ణమూర్తి, సిద్దేశ్వరరావుల” సహకారం అని చెప్పుకోవచ్చు.నిజానికి పరిశ్రమలో ఎలాంటి పరిచయాలు లేకపోయినా.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనని తాను నిరూపించుకుని “జాకట రమేశ్” దర్శకుడిగా మారాడు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన తొలి చిత్రం “రథేరా”. గ్రామీణ క్రీడ అయిన ఖోఖో నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం చూసి.. ప్యాన్ ఇండియా స్టార్ రైటర్ విజేయంద్ర ప్రసాద్.. దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించారు అంటే “జాకట రమేశ్” టాలెంట్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
మొదటి ప్రయత్నంలో విజయం సాధించడంతో “జాకట రమేశ్” ఇప్పుడు తన రెండవ ప్రయత్నంగా ‘సారథి’ మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకుని రాబోతున్నారు. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సారథి కూడా ఖోఖో బ్యాగ్రౌండ్‌లో తెరకెక్కిన యాక్షన్ బేస్డ్ మూవీ కావడం. అంతేగాక.. “జాకట రమేశ్” మొదటి చిత్రం “రథేరా” కి సారథి కొనసాగింపు కావడం మరో హైలెట్. నందమూరి తారకరత్న సారథి మూవీకి మరో బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పుకోవచ్చు. హీరోగా జయాపజయాలు సమానంగా చూసిన తారకరత్న నటుడిగా మాత్రం ఎప్పుడూ సత్తా చాటుతూనే వస్తున్నారు. ముఖ్యంగా సారథి ప్రమోషనల్ వీడియోస్ చూస్తుంటే..
ఇందులో తారకరత్న తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని అర్ధం అవుతోంది. అలాగే.. ఇందులో ఈ నందమూరి హీరో లుక్, యాక్షన్స్ అన్నీ టాప్ లెవల్లో ఉండటంతో మూవీ లవర్స్ దృష్టి సారథి మూవీపై పడటానికి కారణం అయ్యింది. ఇక ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సారథి మూవీ.. క్లీన్ U సర్టిఫికెట్ దక్కించుకోవడం విశేషం. ఎలాగో.. గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద నందమూరి హీరోల హవా కొనసాగుతూ ఉండటంతో.. తారకరత్న కూడా సారథి మూవీ సాలిడ్ సక్సెస్ కొట్టడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. మరి విడుదలకి ముందే ఇన్ని పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న.. సారథి ఎంతటి ఘన విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి : Mrunal Thakur: గుర్తుపట్టలేని స్థితిలో ‘సీతారామమ్’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్!