తెలుగు సినిమా పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కళాతపస్వి కె.విశ్వనాథ్ కాలం చేశారని తెలుసుకుని కన్నీటి పర్యంతమైంది. గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విశ్వానాథ్ తుదిశ్వాస విడిచారు. వయోభారం కారణంగానే విశ్వనాథ్ కాలంచేసినట్లు చెబుతున్నారు. విశ్వనాథ్ టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎందరో హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న ప్రతి ఒక్కరు కె.విశ్వనాథ్ అభిమానులు, భక్తులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిలో కమల్ హాసన్ కూడా ఒకరు.
విశ్వనాథ్ ఇకలేరని తెలుసుకుని కమల్ హాసన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక అభిమానిగా ఆయనలేరనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. విశ్వనాథ్ కన్నుమూయడంపై భావోద్వేగానికి లోనయ్యారు. “విశ్వనాథ్ గారు జీవించి ఉండటం, కళా రూపంలో చిరంజీవిగా వర్దిల్లడం అనే విషయాలను అర్థం చేసుకున్నారు. ఆయన తీసిన సినిమాల రూపంలో కళాతపస్విని ఈ ప్రపంచం ఎప్పటికీ గుర్తుచుంకుటుంది. కళ రూపంలో ఆయన చిరస్మరణీయంగా వర్దిల్లుతారు” అంటూ ఒక అభిమానిగా కమల్ హాసన్ తన సొంత హ్యాడ్ రైటింగ్ తో ఒక ఎమోషనల్ నోట్ రాశారు.
విశ్వనాథ్ పార్దివదేహాన్ని స్వగ్రహానికి తరలించారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు, స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు అంతా విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు. ఆయన భౌతికకాయాన్ని చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు. కె.విశ్వనాథ్ ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు. సినిమాల్లో సౌండ్ రికార్డిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టారు. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 2016లో ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆయన తొలి చిత్రం ‘ఆత్మగౌరవం’తో విశ్వనాథ్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.
Salute to a master . pic.twitter.com/zs0ElDYVUM
— Kamal Haasan (@ikamalhaasan) February 3, 2023