తెలుగు ఇండస్ట్రీలో విశ్వనటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యక పరిచయం అక్కరలేదు. ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఓటీటీ మాధ్యమానికి ఏ రకమైన ప్రేక్షకాధరణ ఉందో అందరికీ తెలిసిందే.
ఒకప్పుడు వెండితెరపై వచ్చిన సినిమాలు ఎప్పుడో కాని బుల్లితెరపై వచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుతం ఓటీటీ మాధ్యమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఏ సినిమా రిలీజ్ అయినా మరుసటి రోజు నుంచి ఓటీటీలో రిలీజ్ గురించి టాక్ నడుస్తూనే ఉంటుంది. కేవలం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం తక్కువ బడ్జెట్ లో కొంతమంది మూవీ మేకర్స్ సినిమాలు, వెబ్ సీరీస్ తీస్తున్నారు. అంతేకాదు థియేటర్లలో పెద్దగా మెప్పించకున్నా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గురించి విశ్వనటుడు కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఓటీటీ మాధ్యమానికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. కొత్త సినిమాలు హెచ్ డీ క్లారిటీతో ఇంట్లో కూర్చొని ఓటీటీల్లో చూడటం సర్వసాధారణం అయ్యింది. థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలో పలు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రపంచంలో ఏ భాషా చిత్రమైన సారే ఓటీటీలో చూసే సౌకర్యం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఓటీటీకే జై కొడుతున్నారు. ఇప్పుడు మూవీ విక్షించే ఆడియన్స్ ఎక్కువగా ఓటీటీ కే కనెక్ట్ అవుతున్నారు. ఇంతగా ప్రభావం చూపించిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గురించి విశ్వనటుడు కమల్ హాసన్ ఐఫా-2023 వేడుకల్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దుబాయిలో జరుగుతున్న ఐఫా-2023 అవార్డు వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీ గురించే వినిపిస్తుంది.. ఓటీటీ వ్యవస్థ వస్తుందని నేను ఎప్పుడో చెప్పాను.. కానీ ఎవరూ నమ్మలేదు.. పట్టించుకోలేదు పైగా హెళన కూడా చేశారు. అప్పట్లో నా ఆలోచనలను అంగీకరించని వారికి ఈ రోజు అర్థమై ఉంటుంది’ అని అన్నారు. ప్రపంచంలోని ఏ భాషలో తీసిన సినిమా అయినా ప్రేక్షకులు ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసే అవకాశం లభించింది. నేను చిన్న సినిమాలకు వీరాభిమానిని, అలాంటి సినిమాలు చేసే పెద్ద స్టార్ అయ్యాను.. కొన్ని కథలు వింటే వాటిలో వెంటనే నటించాలని అనిపిస్తుంది.. కొన్నింటిని నిర్మిస్తే బాగుంటుందనిపిస్తుంది.. ప్రస్తుతం నేను నిర్మాతగా వ్యవహరిస్తున్నాను’ అని చెప్పుకొచ్చరు.
2013 లో ‘విశ్వరూపం’ మూవీ ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఈ మూవీని ఎవరూ ఊహించని విధంగా ప్లాన్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు కమల్ హాసన్. డైరెక్ట్ – టు – హూమ్ ప్రోగ్రామ్ ద్వారా డిష్ టీవీలో ఇంట్లో కూర్చొని ‘విశ్వరూపం’ మూవీ చూడొచ్చు. నేరుగా డబ్బు చెల్లించి ఇంట్లోనే చూసేలా ఏర్పాటు చేశారు. కానీ ఈ విషయంలో కమల్ పై థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాజెక్ట్ ని వదిలేశారు కమల్ హాసన్. ఐఫా వేడుకల సందర్భంగా ఓటీటీ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ మూవీలో నటిస్తున్నారు.. ఆయన సరసన కాజల్ అగర్వాల్, రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.