కోట్లాది మంది యూత్ కి ఆమె ఫేవరెట్ హీరోయిన్. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ దాదాపు సినిమాలు చేసేసింది. గ్లామరస్ రోల్స్ తోపాటు స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేసి కేక పుట్టింది. ఇక లాక్ డౌన్ లో గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న కాజల్.. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా మారిపోయింది. అప్పటినుంచి అంటే దాదాపు రెండేళ్లుగా సినిమాలకు దూరంగానే ఉంది. ఈ మధ్య మళ్లీ నటిగా బిజీ కావాలని చూస్తోంది. అందుకు తగ్గట్లే గుర్రపు స్వారీ, కలరిపట్టు లాంటివి నేర్చుకుంటోంది. ఆ వీడియోలని ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్ తో మళ్లీ టచ్ లోకి వస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి కాకముందు కొన్ని సినిమాలు ఒప్పుకొంది. అందులో నాగార్జున ‘ద ఘోస్ట్’తో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. కాజల్ కి పెళ్లి కావడంతో నాగ్ సినిమాని తప్పుకుంది. ఇక కమల్ మూవీ అయితే పలు కారణాల వల్ల ఆగిపోయింది. ఇక తాజాగా ‘ఇండియన్ 2’ షూటింగ్ మొదలైంది. దీంతో కాజల్ అగర్వాల్.. తన పాత్ర కోసం గుర్రపు స్వారీ, కలరిపట్టు లాంటివి నేర్చుకుంటోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మొన్నటికి మొన్న తిరుపతి శ్రీ వేంకటేశ్వర దర్శనానికి భర్త గౌతమ్ కిచ్లూ కలిసి వచ్చిన ఆమె.. మీడియా కంటపడింది. ఇక ఇప్పుడు ముంబయి ఎయిర్ పోర్టులో షూటింగ్ కోసం వెళ్తుంది. ఈ క్రమంలోనే తొలిసారి కొడుకు నీల్ కిచ్లూ మీడియా ముందుకు తీసుకొచ్చింది. పిల్లాడిని చూసిన కాజల్ అభిమానులు.. భలే క్యూట్ గా ఉన్నాడని కామెంట్స్ పెడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కాజల్ కొడుకు మీకెలా అనిపించాడు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.