ఈ పాప స్టార్ హీరోయిన్. దాదాపు 16 ఏళ్ల నుంచి తెలుగులో సినిమాలు చేస్తూనే ఉంది. ఎంతోమందికి ఈమె ఫేవరెట్ కూడా. మెగాఫ్యామిలీ హీరోలతో ఈమె హిట్స్ కొట్టింది.
ఆమె స్టార్ హీరోయిన్. ఓ సాధారణ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఒకే ఒక్క సినిమాతో దెబ్బకు ఆమె ఫేట్ మారిపోయింది. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. పెళ్లయి కొడుకు పుట్టినా సరే ఇప్పటికే అంతే గ్లామర్ మెంటైన్ చేస్తూ, యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. పెళ్లి వల్ల కాస్త గ్యాప్ ఇచ్చింది. ఈ మధ్య మళ్లీ బిజీ అయిపోతోంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక విషయానికొస్తే.. తెలుగు సినీ ప్రేక్షకుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మూవీ లేదా హీరోయిన్ బాగుంటే చాలు గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా ఇప్పటివరకు చాలామంది బ్యూటీస్ బ్రేక్ ఇచ్చారు. అందులో ఓ హీరోయినే కాజల్ అగర్వాల్. ‘లక్ష్మీ కళ్యాణం’ హీరోయిన్ గా పరిచయమైన ఈమె.. ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమా కోసం చరణ్ తో కలిసి వర్క్ చేసిన కాజల్.. ఆ తర్వాత క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. ఏకంగా మూడు సినిమాల్లో ఈ జోడీ కలిసి నటించింది.
చరణ్ తో మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నం.150’లోనూ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. హిట్ కొట్టేసింది. ఇలా మెగా ఫాదర్ అండ్ సన్ కు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. మగధీర తర్వాత నాయక్, ఆర్య 2, ఎవడు, ఖైదీ నం.150తో హిట్స్ కొట్టిన కాజల్.. ‘గోవిందుడు అందరివాడేలే’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాలతో ఆకట్టుకున్నప్పటికీ హిట్స్ కొట్టలేకపోయింది. ఏదైతేనేం ఓవరాల్ గా చూసుకుంటే.. ఈ బ్యూటీ మెగాఫ్యామిలీకి లక్ అనే చెప్పాలి. లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న ఈమె.. ఓ పిల్లాడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరి ఈమె చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.