తేజ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చందమామ మూవీతో మంచి పేరు సంపాదించింది. అగ్ర కథనాయకుల నుంచి కుర్ర హీరోల సరసన నటించి మెప్పించింది.
కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్.. ఈ పేరు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించింది. లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. పెళ్లి తర్వాత కాజల్ ఎక్కువగా తన భర్త, కొడుకుతోనే లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ అమ్మడు కాస్త బరువెక్కినా.. ఇటీవల ఇండస్ట్రీలోకి రీ ఎంట్ర ఇచ్చేందుకు స్లిమ్ గా మారింది.
సినిమా ఇండస్ట్రీకి కాజల్ అగర్వాల్ కొంత కాలం బ్రేక్ ఇచ్చినప్పటికీ.. ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటు వచ్చింది. తన వ్యక్తితగ విషయాలకు సంబంధించిన ప్రతి విషయం ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉండేది. 2020 ప్రముఖ వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తాను ప్రెగ్నెన్సీ.. తన కొడుకు నెయిల్ కిచ్లూకీ జన్మనివ్వడం వరకు ప్రతీ విషయాన్ని తన ఫ్యాన్స్ కి ఇన్ స్ట్రాలో షేర్ చేస్తూ వచ్చింది. ఇటీవల తన భర్త గౌతమ్ తో కలిసి వరుసగా ఈవెంట్స్ కి వెళ్తూ తెగ సందడి చేస్తుంది కాజల్. ఈ మద్య బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన బాలీవుడ్ మూవీ ‘చత్రపతి’ సెలబ్రిటీ ప్రీమియర్ లో కాజల్ తన భర్తతో సందడి చేసింది.
ఈ మద్యనే మరో ఈవెంట్ లో కాజల్ తన భర్త గౌతమ్ సందడి చేసింది. బ్లాక్ డ్రెస్ లో కళ్లు చేదిరే అందంతో హుయలు ఒలికించింది. ఈ ఫోటోలో తన భర్తను ముద్దుల్లో ముంచెత్తినట్లు కనిపిస్తుంది. భర్త గౌతమ్ కి ఘాటైన లిప్ కిస్ ఇస్తూ తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఇద్దరూ గట్టిగా కౌగిలించుకుని లిప్ లాక్ ముద్దుకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, కాజల్ షేర్ చేసిన ఫొటోస్ ఆమె ఫ్యాన్స్ కి ఐఫీస్ట్ అని చెప్పొచ్చు. కాజల్ చివరిగా ఘోస్టీ అనే మూవీలో నటించింది. ప్రస్తుతం బాలకృష్ణ 108 మూవీలో నటిస్తున్న సంతగి తెలిసిందే. ఇటీవల తన భర్తతో రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలో కూడా తెగ సందడి చేసిన విషయం తెలిసిందే.